Hey Sinamika: ‘విడిపోవడానికి లక్ష కారణాలున్నాయి’.. ఆకట్టుకునేలా ‘హే సినామిక’ ట్రైలర్
‘ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి సవాలక్ష కారణాలున్నాయి. కానీ, కలిసి జీవించటానికి ఉన్న ఒకే ఒక్క కారణం ప్రేమ’ అని అంటున్నారు దుల్కర్ సల్మాన్.
ఇంటర్నెట్ డెస్క్: ‘ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి సవాలక్ష కారణాలున్నాయి. కానీ, కలిసి జీవించటానికి ఉన్న ఒకే ఒక్క కారణం ప్రేమ’ అని అంటున్నారు దుల్కర్ సల్మాన్. ఈయన హీరోగా రూపొందిన ‘హే సినామిక’ చిత్రంలోని సంభాషణ ఇది. ప్రముఖ నృత్య దర్శకురాలు బృందా దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను ప్రముఖ నటుడు మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేయటం సంతోషంగా ఉందని, సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ప్రేమ, పెళ్లి, విడాకులు.. ఈ మూడు ప్రధానాంశాలుగా సినిమాను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. దుల్కర్ చెప్పిన సంభాషణలు, ఆయన విభిన్న లుక్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో దుల్కర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన కాజల్ అగర్వాల్, అదితిరావు హైదరీ నటించారు. జియో స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!
-
India News
Stalin: బుల్లెట్ రైలులో సీఎం స్టాలిన్.. రెండున్నర గంటల్లో 500కి.మీల ప్రయాణం!