సోనూసూద్‌కు హైకోర్టులో చుక్కెదురు

నటుడు సోనూసూద్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురయ్యింది. బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ నోటీసులను సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. జుహూలోని ఆరంతస్తుల భవనాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్‌గా...

Updated : 21 Jan 2021 15:13 IST

పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం

ముంబయి: నటుడు సోనూసూద్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురయ్యింది. బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ నోటీసులను సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. జుహూలోని ఆరంతస్తుల భవనాన్ని అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చారంటూ గతేడాది అక్టోబర్‌లో బీఎంసీ అధికారులు సోనూసూద్‌కు నోటీసులు పంపించారు.

దీంతో సదరు నోటీసులను సవాల్‌ చేస్తూ ఆయన ఇటీవల బాంబే హైకోర్టును సంప్రదించారు. విచారణ అనంతరం న్యాయమూర్తి పృథ్వీరాజ్‌ చవాన్‌ పిటిషన్‌ కొట్టివేశారు. అంతేకాకుండా.. బీఎంసీ అధికారులు నోటీసులు పంపించినప్పుడే స్పందించాల్సిందని.. కానీ ఇప్పటికి ఎంతో ఆలస్యమైందని.. కాబట్టి ఇక, తమ చేతుల్లో కూడా ఏమీ లేదని బీఎంసీని సంప్రదించమని న్యాయమూర్తి పృథ్వీరాజ్‌ సూచించారు.

ముంబయిలోని జుహూ ప్రాంతంలోని ఓ భవనం విషయంలో సోనూసూద్‌, బీఎంసీకు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని హోటల్‌గా మార్చారంటూ గతేడాది సోనూకు బీఎంసీ అధికారులు నోటీసులు పంపిచారు. అయితే, ఎన్నోసార్లు నోటీసులు పంపించినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం లేదని పేర్కొంటూ ఇటీవల సోనూపై కేసు నమోదు చేశారు. అయితే, బీఎంసీ చేస్తున్న ఆరోపణలను సోనూ ఖండించారు. నివాసభవనాన్ని హోటల్‌గా మార్చేందుకు కావాల్సిన ‘ఛేంజ్‌ ఆఫ్‌ యూజర్‌’ అనుమతులు తాను తీసుకున్నానని తెలిపారు. మరోవైపు.. ముంబయిలోని ఎన్నో ప్రాంతాల్లో సోనూకు సంబంధించిన అక్రమ కట్టడాలకు కూల్చివేశామని కొన్నిరోజులుగా క్రితం నటుడిపై బీఎంసీ తీవ్ర ఆరోపణలు కూడా చేసింది.

ఇదీ చదవండి

డ్రగ్స్‌ కేసులో నటి రాగిణికి బెయిల్‌ మంజూరు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని