‘హైవే’.. మొదలైంది

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా దర్శకుడు కేవీ గుహన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘హైవే. మలయాళీ నటి మానస రాధాకృష్ణన్‌ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతుంది.

Published : 14 Jul 2021 15:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా దర్శకుడు కేవీ గుహన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘హైవే. మలయాళీ నటి మానస రాధాకృష్ణన్‌ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. బుధవారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించినట్టు చిత్ర బృందం తెలిపింది. సెట్‌లో అడుగుపెట్టిన నాయకానాయికల ఫొటోని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్‌ పతాకంపై వెంకట్‌ తలారి నిర్మిస్తున్నారు. సిమన్‌ కె.కింగ్‌ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ‘పుష్పక విమానం’ చిత్రంలో నటిస్తున్నాడు ఆనంద్‌. సినిమాటోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గుహన్‌ దర్శకుడిగా మారి తెలుగులో ‘118’ , ‘WWW’ చిత్రాలు తెరకెక్కించారు. కల్యాణ్‌ రామ్‌ హీరోగా మరో చిత్రాన్ని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని