Highest Grossing Movies: పది సినిమాలు.. రూ. 2200 కోట్లు.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టాప్
ఈ ఏడాది ఎన్నో తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిల్లో అత్యధిక వసూళ్లు సాధించిన పది చిత్రాల గురించి తెలుసుకోవాలనుందా? ఇది చదివేయండి..
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ టైమ్ నుంచి ఓటీటీ ప్రభావం ఎక్కువగా ఉండడంతో థియేటర్లకు ప్రేక్షకులు రావడం కష్టమే అని కొందరు అనుకున్నారు. ఒకవేళ వచ్చినా వసూళ్ల మాట ఎత్తకపోవడమే మంచిదని మరికొందరు భావించారు. థియేటర్లు పూర్వవైభవం సంతరించుకోవడం కల అని ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, ఇవన్నీ మాటలకే పరిమితమయ్యాయి. 2020 నుంచి ఒక్కో ఏడాది ఒక్కో వేవ్ టెన్షన్ పెట్టినా ఆయా జాగ్రత్తలు పాటిస్తూ ఆడియన్స్ థియేటర్లలో అడుగుపెట్టారు. ‘చిన్న తెర కాదు వెండితెరే ప్రాధాన్యం’ అని నిరూపించారు. క్రమక్రమంగా వసూళ్లు పెరిగాయి. 2020లో ఆశించిన స్థాయిలో లేకపోయినా 2021లో తెలుగు సినిమాలు రూ. వందల కోట్ల మార్కెట్‌కు చేరాయి. ఈ ఏడాది రూ. వేల కోట్ల మార్క్ చేరుకుని, మునుపటి కళను తీసుకొచ్చాయి. 2022లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వసూళ్లు (గ్రాస్) సాధించిన పది తెలుగు చిత్రాలేవో చూద్దాం..
ఆర్‌ఆర్‌ఆర్.. నంబరు 1
ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) రూ. 1200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ నమోదు చేసిన చిత్రాల జాబితాలో తొలి స్థానం కైవసం చేసుకుంది. ఈ సినిమా బడ్జెట్: దాదాపు రూ. 550 కోట్లు.
సర్కారు వారి పాట మోత మోగింది
పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). సుమారు రూ. 60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు చేసింది.
భీమ్లా నాయక్.. పవర్ చూపించాడు
పవన్ కల్యాణ్ హీరోగా, రానా దగ్గుబాటి విలన్‌గా తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak). సాగర్. కె. దర్శకత్వం వహించారు. సుమారు రూ. 70 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా రూ. 161 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
రాధేశ్యామ్ పరిస్థితి ఇది..
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) చిత్రం ఆయన అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రం రూ. 151 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినా నిర్మాణ వ్యయం రూ. 300కోట్లు దాటడంతో ‘రాధేశ్యామ్’ ఫెయిల్యూర్‌గా నిలిచింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది.
ఫన్ పంచి.. రూ. కోట్లు కొల్లగొట్టి
వెంకటేశ్, వరుణ్‌తేజ్‌లతో దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన నవ్వుల ధమాకా ‘ఎఫ్ 3’ (F3). ఇదే కాంబోలో గతంలో వచ్చిన ‘ఎఫ్ 2’కు సీక్వెల్ అయిన ఈ సినిమా బడ్జెట్ రూ. 70 కోట్లు. వసూళ్లు సుమారు రూ. 134 కోట్లు.
సీక్వెల్‌తోనూ సక్సెస్
నటుడు నిఖిల్- దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది విడుదలైన ‘కార్తికేయ 2’ (Karthikeya 2) కూడా హిట్‌గా నిలిచింది. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ. 120 కోట్ల వసూళ్లు చేసింది.
గాడ్ ఫాదర్ ఇలా..
చిరంజీవి హీరోగా మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’ (God Father). ఈ సినిమా సుమారు రూ. 150 కోట్ల వసూళ్లు సాధించింది. దీని బడ్జెట్: రూ. 100 కోట్లు.
హత్తుకున్న సీతా రామ్‌ల కథ
కమర్షియల్ హంగులు లేకపోయినా బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచింది ‘సీతారామం’ (Sita Ramam). దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా నిర్మాణ వ్యయం: రూ. 30 కోట్లు; వసూళ్లు: రూ. 90 కోట్లకుపైగా.
ఆచార్య..!
చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆచార్య’ (Acharya). కొరటాల శివ దర్శకుడు. బాక్సాఫీసు వద్ద రూ. 76 కోట్ల వసూళ్లు చేసిన చిత్రంగా ఉన్నా బడ్జెట్ రూ. 140 కోట్లు కావడంతో నష్టాన్ని చవిచూసింది.
బింబిసారుడు మెప్పించాడు
కల్యాణ్‌రామ్ హీరోగా నూతన దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన సినిమా ‘బింబిసార’ (Bimbisara). రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం సుమారు రూ. 65 కోట్లు కలెక్ట్ చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!