Highway: ఉత్కంఠగా ‘హైవే’ ట్రైలర్‌.. కొత్త లుక్‌లో ఆనంద్‌ దేవరకొండ

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన హైవే సినిమా ట్రైలర్‌ విడుదలైంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 16 Aug 2022 12:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా కె.వి. గుహన్‌ (KV Guhan) తెరకెక్కించిన చిత్రం ‘హైవే’ (Highway). మానస కథానాయిక. అభిషేక్‌ బెనర్జీ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘ఆహా’లో ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర ట్రైలర్‌ని నటుడు నాగశౌర్య విడుదల చేశారు. ‘వరుస హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సైకో కిల్లర్‌’ అనే న్యూస్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్టు ప్రచార చిత్రాన్ని చూస్తే అర్థమవుతోంది. ఆనంద్‌ లుక్‌ కొత్తగా ఉంది. ఈ చిత్రంలో ఆనంద్‌ ఫొటోగ్రాఫర్‌గా కనిపించనున్నారు. ఆయన ప్రేయసిగా మానస నటించింది. వీరి ప్రేమ కథలో ‘డి’ అనే ఓ కిల్లర్‌ ప్రవేశిస్తాడు. మరి, ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని