Hina Khan: ప్రముఖ బాలీవుడ్‌ టీవీ నటికి క్యాన్సర్‌

‘ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’ సీరియల్‌తో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ బాలీవుడ్‌ టీవీ నటి హీనాఖాన్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు.

Updated : 28 Jun 2024 15:38 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ప్రముఖ బాలీవుడ్‌ టీవీ నటి హీనాఖాన్ (hina khan) స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లుగా తన అధికారిక ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రముఖ టీవీ సీరియల్ ‘ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’తో ఆమె ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో క్యాన్సర్‌ మహమ్మారితో పోరాటం చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని, దీని నుంచి కచ్చితంగా బయటపడగలననే నమ్మకం ఉందని ఆమె సోషల్‌మీడియా వేదికగా రాసుకొచ్చారు. అభిమానులు తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని కోరారు. కాగా హీనాఖాన్‌ పోస్ట్‌పై తోటి నటులు, అభిమానులు స్పందిస్తూ.. మీపై ప్రేమాభిమానాలు, గౌరవం ఎప్పటికీ ఉంటాయని, త్వరగా కోలుకొని మా ముందుకురావాలని పోస్టులు పెట్టారు. బాలీవుడ్‌ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటులలో హీనాఖాన్ ఒకరు. ప్రముఖ టీవీ సీరియల్ ‘ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’లో ఆమె పోషించిన అక్షర పాత్ర ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలు పొందింది. అంతే కాకుండా హీనా బిగ్ బాస్, ఖత్రోన్ కే ఖిలాడీ వంటి రియాలిటీ షోలలో పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని