Kajal: బాలీవుడ్‌లో నైతిక విలువలు లోపించాయి.. కాజల్‌ కీలక వ్యాఖ్యలు

బీటౌన్‌లో రాజకీయాలు ఎక్కువంటూ నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) చేసిన వ్యాఖ్యలు మర్చిపోక ముందే నటి కాజల్‌ అగర్వాల్‌ (kajal) కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదితో పోలిస్తే హిందీ చిత్ర పరిశ్రమలో విలువలు లోపించాయని ఆమె అన్నారు.

Published : 31 Mar 2023 11:15 IST

ముంబయి: బాలీవుడ్‌ (Bollywood) చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు నటి కాజల్‌ అగర్వాల్‌ (Kajal). బాలీవుడ్‌లో నైతికత లోపించిందని.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఉన్న విలువలు అక్కడ లేవని అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కాజల్‌ ‘దక్షిణాది సినిమాలు వర్సెస్‌ బాలీవుడ్‌’ అనే అంశంపై ఈ మేరకు స్పందించారు. టాలెంట్‌ ఉంటే  దక్షిణాది ప్రేక్షకులు తప్పకుండా అంగీకరిస్తారని అన్నారు.

‘‘నేను ముంబయి అమ్మాయిని. పుట్టి, పెరిగిందంతా ఇక్కడే. అయితే.. నా కెరీర్‌ మొదలైంది హైదరాబాద్‌లో. తమిళం, తెలుగు సినిమాల్లోనే నేను ఎక్కువగా పనిచేశాను. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ హైదరాబాద్‌, చెన్నై నగరాలనే నివాసంగా భావిస్తుంటా. అది ఎప్పటికీ మారదు. దక్షిణాది చిత్రపరిశ్రమలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. టాలెంట్‌ ఉంటే ఎవరినైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. అద్భుతమైన దర్శకులు, టెక్నీషియన్స్‌ అక్కడ ఉన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మంచి కంటెంట్‌ వస్తుంటుంది. హిందీ మా మాతృభాష. బాలీవుడ్‌ సినిమాలు చూస్తూ పెరిగాం. బీటౌన్‌లోనూ నేను మంచి సినిమాల్లో నటించా. కానీ, దక్షిణాది పరిశ్రమలో ఉన్న నైతికత, విలువలు, క్రమశిక్షణ బాలీవుడ్‌లో లోపించాయని నేను భావిస్తున్నా’’ అని కాజల్‌ (Kajal) అన్నారు. కాజల్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పలువురు బీటౌన్‌ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా ట్రోల్స్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని