DoubleXL: హిందీలో మరో డిజాస్టర్‌ ఫిల్మ్‌.. ఇప్పుడు ఓటీటీలో..!

సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో నటించిన ‘డబుల్ ఎక్స్‌ఎల్‌’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Published : 28 Dec 2022 23:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో శత్రమ్‌ రామణి దర్శకత్వం వహించిన హిందీ కామెడీ ఫిల్మ్‌ ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా, తాజాగా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ పోస్టర్‌ను పంచుకుంది. 2022లో హిందీలో నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకున్న టాప్‌ చిత్రాల జాబితాలో ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’ నిలిచింది. ఈ చిత్రం మొత్తంగా రూ.1.12 కోట్లు వసూలు చేయడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని