13ఏళ్లకు ‘బొమ్మరిల్లు’ హిందీ రీమేక్ విడుదల
తల్లిదండ్రులు తమ పిల్లల్ని అతి జాగ్రత్తతో చూడటం వల్ల వారు పడే మనోవేదనను గుండెలకు హత్తుకునేలా చూపించిన చిత్రం ‘బొమ్మరిల్లు’. సిద్ధుగా
హైదరాబాద్: తల్లిదండ్రులు తమ పిల్లల్ని అతి జాగ్రత్తతో చూడటం వల్ల వారు పడే మనోవేదనను గుండెలకు హత్తుకునేలా చూపించిన చిత్రం ‘బొమ్మరిల్లు’. సిద్ధుగా సిద్ధార్థ్, హాసినిగా జెనీలియా, సిద్ధు తండ్రి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ల నటన మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం హిందీలోనూ రీమేక్ అయింది.
బోనీకపూర్ నిర్మాతగా అన్నీస్ బజ్మి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. హర్మన్ బవేజా, జెనీలియా జంటగా నటించారు. తండ్రి పాత్రలో నానా పటేకర్ నటించారు. 2007లో తెరకెక్కిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఇది విడుదలకు నోచుకోలేదు. అప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకురానుంది. నవంబరు 29న జీ సినిమాలో నేరుగా దీన్ని ప్రసారం చేయనున్నట్లు నిర్మాత బోనీకపూర్ వెల్లడించారు. దాదాపు పదమూడేళ్ల పాటు ఈ సినిమా విడుదలకు నోచుకోకపోవడం గమనార్హం. మరి ఇన్నేళ్ల తర్వాత ఇది బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుందా? లేదా? చూడాలంటే నెలాఖరు వరకూ వేచి చూడాల్సిందే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు