HIT: ‘హిట్‌’ కోసం కొత్త తేదీ

ది ఫస్ట్‌ కేస్‌’ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో అదే పేరుతో పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్‌కుమార్‌ రావు హీరోగా నటిస్తున్న ఈ సినిమాని శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్నారు.

Updated : 14 May 2022 12:24 IST

హీరో నాని నిర్మించిన ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో అదే పేరుతో పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్‌కుమార్‌ రావు హీరోగా నటిస్తున్న ఈ సినిమాని శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్నారు. దిల్‌రాజు, భూషణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాన్యా మల్హోత్రా కథానాయిక. ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేయనున్నట్లు గతంలో  ప్రకటించారు. ఇప్పుడు దీన్ని జులై 15కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘‘మా సినిమా థియేటర్లలోకి రానుంది. ముందు అనుకున్నట్లు కాకుండా కొత్త రిలీజ్‌ డేట్‌ జులై 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అని నిర్మాణ సంస్థలు తమ ట్వీట్‌లో పేర్కొన్నాయి. ‘‘విభిన్నమైన ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. రాజ్‌ కుమార్‌ శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ప్రచార చిత్రాలు  విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని