Hit 2: మనందరం గర్వపడే నాణ్యమైన సినిమా ఇది
‘హిట్ 2’ చూసేటప్పుడే ‘హిట్ 3’లో హీరో ఎవరనేది ప్రేక్షకులకు అర్థమవుతుందన్నారు హీరో నాని. ఆయన సమర్పకులుగా రూపొందిన చిత్రం ‘హిట్ 2’. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు.
‘హిట్ 2’ వేడుకలో దర్శకుడు రాజమౌళి
‘హిట్ 2’ చూసేటప్పుడే ‘హిట్ 3’లో హీరో ఎవరనేది ప్రేక్షకులకు అర్థమవుతుందన్నారు హీరో నాని. ఆయన సమర్పకులుగా రూపొందిన చిత్రం ‘హిట్ 2’. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. ‘హిట్’కి కొనసాగింపుగా రూపొందిన ఈ చిత్రం డిసెంబరు 2న రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘హిట్ సినిమాని ఫ్రాంచైజీలా తయారు చేసిన దర్శకనిర్మాతలకి శుభాకాంక్షలు. ఈ తరహా కథల్లో ఇలాంటి ఫ్రాంచైజీ మన దేశంలోనే లేదు. కథానాయకులుగా తెరపై ఎవరు కనిపించినా ప్రేక్షకులు చూడ్డానికి వచ్చే ఫ్రాంచైజీ ఇది. విష్వక్ కానీ, శేష్ కానీ చాలా ఉత్సాహాన్ని తీసుకొచ్చారు ఈ కథలకి! ఈ ఫ్రాంచైజీలో ప్రతి సినిమా ఒకే సీజన్‌లో రావాలి. ఇది హిట్ సీజన్ అని ప్రేక్షకులకు అర్థమయ్యేలా, ప్రతి ఏడాదీ ఒకే తేదీన విడుదలయ్యేలా చూడాలి. ఇది మనందరం గర్వపడే నాణ్యమైన సినిమా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అడివి శేష్, విష్వక్‌సేన్, శైలేష్ కొలను, శోభు యార్లగడ్డ, దీప్తి గంటా, ప్రశాంత్ వర్మ, ఎం.ఎం.శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KVS exam: కేవీల్లో ఉద్యోగ నియామక పరీక్ష తేదీల్లో మార్పు.. కొత్త తేదీలివే..!
-
World News
Remarriage: మాజీ భార్యతో మళ్లీ పెళ్లి ..! ఆ వివాహం వెనక కదిలించే స్టోరీ
-
General News
KTR: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారీ సభ.. జనసమీకరణపై నేతలతో కేటీఆర్ భేటీ
-
Movies News
Social Look: పూజా సీమంతం.. శ్రద్ధాదాస్ హాఫ్‌శారీ.. టీమ్‌తో రాశీఖన్నా!
-
World News
Earthquake: తుర్కియేలో 1100 సార్లు ప్రకంపనలు.. 17వేలు దాటిన మరణాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు