HIT 2: తమ్ముడి హత్య కేసు.. శేష్ ఆ క్రిమినల్‌ని ఎలా పట్టుకున్నాడంటే
‘హిట్-2’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటుడు అడివి శేష్. ఆయన పోలీస్ అధికారిగా నటించిన ఈసినిమా నుంచి తాజాగా ఓ స్పెషల్ వీడియో విడుదలైంది.
హైదరాబాద్: అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ చిత్రం ‘హిట్ -2’ (HIT 2). మహిళల వరుస హత్యల నేపథ్యంలో దర్శకుడు శైలేష్ కొలను దీన్ని చిత్రీకరించారు. కేడీ అనే పోలీస్ అధికారిగా శేష్ నటన అందర్నీ కట్టిపడేసింది. శనివారం ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని ‘హిట్-2’ నుంచి మొదటి నాలుగు నిమిషాల సినిమాని చిత్రబృందం నెటిజన్లతో పంచుకుంది. ఇందులో శేష్ ఓ హత్య కేసులో నిందితుడిని ఎలా పట్టుకున్నారో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కథేంటంటే:
విశాఖపట్నం నేపథ్యంలో సాగే కథ ఇది. రామ్ ప్రసాద్ (హర్షవర్ధన్) సమాజంలో మంచి పేరు కలిగిన వ్యక్తి. భార్యాపిల్లల్ని సంతోషంగా చూసుకోవడం కోసం ఎంతో కష్టపడుతుంటాడు. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకుందని తెలిసి.. ఆవేదనకు గురి అవుతాడు. నిజం తెలిసిపోవడంతో భర్త పరువు తీసేందుకు రామ్ ప్రసాద్ భార్య మహిళా సంఘాలు, పోలీసులను ఆశ్రయిస్తుంది. దీంతో అవమానం తట్టుకోలేక రామ్‌ప్రసాద్ ఆత్మహత్య చేసుకుంటాడు. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత.. వైజాగ్‌లో సంజనా అనే అమ్మాయి హత్యకు గురి అవుతుంది. ఈ కేసును చేధించే క్రమంలోమహిళా సంఘాల్లో పనిచేస్తోన్న మరికొంతమంది మహిళలు హత్యకు గురైనట్లు తెలుసుకుంటాడు కేడీ (అడివి శేష్). మరి, వరుస హత్యలకు పాల్పడిన హంతకుడెవరు? అతడిని కేడీ ఎలా పట్టుకున్నాడు? ఇలాంటి ఆసక్తికర అంశాలతో ఈసినిమా తెరకెక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు
-
Vijayawada: సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్
-
Rohit Sharma: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్‌కప్ జట్టుపై నో డౌట్స్: రోహిత్
-
Gautam Gambhir: తిరుమల శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్ దంపతులు