HIT 2: ఆ సినిమాలా రూ.300 కోట్లు రాలేదు కానీ..: శైలేశ్ కొలను
శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’. ఇప్పుడదే చిత్రానికి సీక్వెల్‌గా సిద్ధమవుతోన్న చిత్రం ‘హిట్ -2’. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమా టీజర్ తాజాగా విడుదలైంది.
హైదరాబాద్: పోలీసు వ్యవస్థపై తనకెంతో గౌరవం ఉందని అన్నారు దర్శకుడు శైలేశ్ కొలను. సమాజంలో శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసులు ఎంతో కష్టపడుతున్నారని, వాళ్ల సేవలను తెలియజేయడం కోసమే తాను ‘హిట్’ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నానని ఆయన తెలిపారు. ‘హిట్-2’ టీజర్ విడుదల అనంతరం హీరో అడివి శేష్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
టీజర్ చివర్లో భయానక దృశ్యాలు చూపించారు. దానివల్ల ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయా?
శైలేశ్: ప్రేక్షకులు ఇబ్బంది పడకుండా.. కేవలం క్రైమ్లోని తీవ్రత తెలిసేలా మాత్రమే షూట్ చేశాం. అందుకోసం మణి సృజనాత్మకంగా పని చేశారు. సినిమాలో ఉండే అత్యంత భయానక దృశ్యమిదే. ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు దాన్ని టీజర్లో చూపించాం. సినిమాని ఎలా చూపించాలనే విషయంలో నాకు ఒక స్పష్టత ఉంది. దానికి అనుగుణంగానే వర్క్ చేశా.
ఈ కథకు స్ఫూర్తి ఏమిటి?
శైలేశ్: వేరు వేరే సందర్భాల్లో చదివిన పుస్తకాలు, న్యూస్ పేపర్లలో వచ్చే వార్తలను ఆధారంగా చేసుకునే.. ‘హిట్’వర్స్‌లో కథలు రాస్తున్నా.
మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లే అవకాశం ఉందా?
శైలేశ్: ‘హిట్’ని బాలీవుడ్లో దర్శకత్వం వహించి.. అక్కడివారికి పరిచయమయ్యా. బాలీవుడ్ నాకు మంచి అనుభవాన్ని అందించింది. డైరెక్టర్‌గా నేను పర్ఫెక్ట్గా వర్క్ చేశా. బాక్సాఫీస్ వద్ద సినిమా ఎంత వసూళ్లు రాబడుతుందనేది రిలీజ్ టైమ్, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ‘భూల్ భూలయ్యా - 2’ మాదిరిగా రూ.300 కోట్లు వసూలు చేయకపోయినా.. నా నిర్మాతలకు డబ్బులు మాత్రం వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌లోనూ ‘హిట్’ (హిందీ) ట్రెండింగ్‌లో ఉంది.
ఇండస్ట్రీలో ఉన్న హీరోల సపోర్ట్ మీకు ఉంది కదా. మీరు, భవిష్యత్తులో ఏ హీరోతోనైనా సినిమా నిర్మిస్తారా?
శేష్: తప్పకుండా. నా సినిమాలతో కొత్త దర్శకులు, సంగీత దర్శకులు, నటీనటులు, రచయితలను ప్రోత్సహించా. త్వరలోనే కొత్త హీరోను కూడా ప్రోత్సహిస్తా.
‘మేజర్’తో పాన్ ఇండియా హీరో అయ్యారు. మరి, ఈ సినిమా కేవలం తెలుగుకే పరిమితం అవుతుందని ఫీలవుతున్నారా?
శేష్: కథ గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తా. ఇది వైజాగ్‌లో జరిగే కథ. అందులో డైలాగ్స్, సీన్స్ ఇక్కడి వారికి సెట్ అయ్యేలా ఉంటాయి. అయితే, ప్రస్తుతానికి ఈ సినిమాని డబ్ చేయడం పై చర్చలు జరుగుతున్నాయి. తెలుగు తర్వాత వీలుంటే హిందీలోనూ రిలీజ్ చేస్తాం.
‘హిట్’లో విశ్వక్సేన్ చేశారు. ‘హిట్ -2’లో మీరు చేస్తున్నందుకు ఏమైనా ఫీలవుతున్నారా?
శేష్: శైలేశ్ నా వద్దకు వచ్చినప్పుడు.. ‘విశ్వక్ ఉండగా నేను నటించడం ఏమిటి?’ అనే అడిగా. శైలేశ్.. హిట్ యూనివర్స్ క్రియేట్ చేయాలనుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగే క్రైమ్స్‌ను ఒక్కో స్టోరీగా చూపించనున్నారు. ఆయా కథల్లో వేర్వేరు హీరోలతో తెరకెక్కించి.. అందర్నీ ఒకే కథలోకి తీసుకురానున్నారు. హల్క్ ఇప్పటికే ఉన్నాడు. కెప్టెన్ అమెరికా కూడా వస్తే బాగుంటుందని నాకు ఫోన్ చేశారు.
హిట్‌వర్స్‌లో వచ్చే కథలన్నీ ఒకే టైమ్‌లో జరుగుతుంటాయా?
శైలేశ్: ‘హిట్’ యూనివర్స్‌లో వివిధ కథలు చూపించినప్పటికీ.. అవన్నీ ఒకే సయమంలో జరుగుతున్నట్టు చూపించనున్నాం. హీరోలందరూ వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు. క్రైమ్ పెద్దదైనప్పుడు వీళ్లందరూ కలిసి కనిపించనున్నారు. తప్పకుండా మీరు సర్ప్రైజ్ కానున్నారు.
‘‘మీ అందర్నీ ఇలా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. కొంత సేపటి నుంచి నా జర్నీ గురించే ఆలోచిస్తున్నా. ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికీ నచ్చే హీరోని నేనేనని అందరూ అంటుంటారు. ‘క్షణం’ రిలీజైనప్పుడు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సినిమాల కోసం ట్వీట్ చేయని బన్నీ మా సినిమా కోసం ఒక లేఖ రాసి పోస్ట్ చేశాడు. అది మా సినిమాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది. ‘మేజర్’కు మహేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరించారు. నన్ను పాన్ ఇండియా హీరోగా చేశారు. ఇక, నాని తన ‘హిట్’ ప్రపంచంలో నన్నూ భాగం చేశారు. ఇండస్ట్రీలోని పెద్దలు నన్ను అంతలా నమ్మడానికి కారణం సినిమాపై నేను చూపించే ఆసక్తి. ఈ సినిమా విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నా. మీ అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సినిమా బాగుంటుంది. ‘హిట్-1’ ప్రశ్నలతో ఉత్కంఠకు గురి చేసింది. ‘హిట్-2’ భయపెట్టి అందర్నీ థ్రిల్ చేస్తుంది. ఇప్పటి వరకూ నేను నటించిన ఐదు సినిమాలు వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నా’’ అని శేష్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య44’.. అధికారికంగా ప్రకటించిన హీరో
ప్రముఖ కథానాయకుడు సూర్య తన 44వ చిత్రాన్ని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌పై దిల్‌రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రికార్డు సృష్టించిన మలయాళ చిత్రం.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ హిట్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో విడుదల కానుంది. ఎప్పుడంటే? -
RC17: రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో అదే హైలైట్: రాజమౌళి
రామ్ చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి కామెంట్స్ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు. -
RC17: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబో
రామ్ చరణ్ కొత్త చిత్రం ప్రకటించారు. స్టార్ దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్టుకు (#RC17) శ్రీకారం చుట్టారు. -
priyadarshi: ప్రియదర్శి- ఇంద్రగంటి కొత్త సినిమా ప్రారంభం
ప్రియదర్శి కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. -
Kamal Haasan: మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చిన కమల్ హాసన్.. ‘కల్కి’ గురించి ఏమన్నారంటే!
తాను నటిస్తోన్న సినిమాల అప్డేట్లను కమల్ హాసన్ పంచుకున్నారు. -
upcoming movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
upcoming movies: మార్చి ఆఖరి వారంలో అటు థియేటర్లో పాటు, ఇటు ఓటీటీలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి చిత్రాలు సిద్ధమవుతున్నాయి. -
War 2: వార్2లో కంపోజర్ ప్రీతమ్ భాగం కానున్నారా?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. -
Double Ismart Movie Update: ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్‌పై రామ్ కామెంట్స్.. ఏమన్నారంటే!
‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రిలీజ్ డేట్‌పై రామ్ కామెంట్ చేశారు. -
Kalki 2898AD: ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
Devara: ‘దేవర’లో మరాఠీ బ్యూటీ.. తన పాత్ర ఏంటో చెప్పేసిన నటి!
ఎన్టీఆర్ సరసన నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి వెల్లడించారు. -
SSMB29: మహేశ్-రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచేసిన కార్తికేయ.. ఏమన్నారంటే!
రాజమౌళి-మహేశ్ సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ కామెంట్ చేశారు. -
Shiva Rajkumar: ఇది మరో స్థాయిలో ఉంటుంది: రామ్ చరణ్ చిత్రంపై శివ రాజ్‌కుమార్
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. -
Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్ కాఫీ మాత్రమే తాగా: పృథ్వీరాజ్
Aadujeevitham: పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించిన ‘ఆడుజీవితం’ షూటింగ్ విశేషాలను ఆయన పంచుకున్నారు. -
Pushpa2: ‘పుష్ప2’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రష్మిక..ఫొటో వైరల్
‘పుష్ప2’ షూటింగ్ ప్రస్తుతం యాగంటిలో జరుగుతున్నట్లు రష్మిక తెలిపారు. -
Dhanush: అందుకు నేను గర్వపడుతున్నా: ధనుష్
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా రానుంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కింది. -
RamCharan: అట్టహాసంగా రామ్‌చరణ్ కొత్త సినిమా ప్రారంభం
రామ్‌చరణ్ (Ram Charan) కొత్త సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
మలయాళ చిత్ర పరిశ్రమలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ రికార్డు సృష్టించింది. అదేంటంటే?