The First Case: హిందీ ‘హిట్‌’ ట్రైలర్‌ చూశారా?

‘నీకు, లేదా నీ స్నేహితుల్లో ఎవరికైనా బ్లూ సెడాన్‌ కారు ఉందా?’ అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు రాజ్‌ కుమార్‌రావు(Rajkumar Rao).

Published : 23 Jun 2022 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నీకు, లేదా నీ స్నేహితుల్లో ఎవరికైనా బ్లూ సెడాన్‌ కారు ఉందా?’ అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు రాజ్‌ కుమార్‌రావు(Rajkumar Rao). ఆయన పోలీస్‌ ఆఫీసర్‌గా తెరకెక్కిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’(HIT: The first case). సాన్య మల్హోత్ర కథానాయిక. శైలేష్‌ కొలను దర్శకుడు. 2020లో విశ్వక్‌సేన్‌ కీలక పాత్రలో నటించిన ‘హిట్‌’కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. మాతృక మాదిరిగానే కథ, కథానాలను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. రాజ్‌కుమార్‌రావు నటన, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటివరకూ ఈ ట్రైలర్‌ చూసేయండి. మరోవైపు శైలేష్‌ కొలను దర్శకత్వంలో అడవి శేష్‌ హీరోగా ‘హిట్‌-2’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇది కూడా వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కథ ఇదీ: ప్రమాదాల్ని ముందే ఊహించి అరిక‌ట్టే హోమిసైడ్‌ ఇంటర్వెన్షన్‌ టీమ్‌ (హిట్‌)కి చెందిన ఓ పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు రాజ్‌ కుమార్‌రావు. మాన‌సికంగా తను ఒక స‌మ‌స్యతో బాధ‌ప‌డుతుంటాడు. దాంతో అత‌న్ని గ‌తం వెంటాడుతుంటుంది. కొన్నిరోజులు ఉద్యోగానికి సెల‌వు పెట్టి విశ్రాంతి తీసుకోవాల‌నుకుంటాడు. ఇంత‌లోనే ప్రీతి అనే అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. ఆ వెంటనే ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తున్న త‌న ప్రేయ‌సి డాక్టర్ నేహా (సాన్య మల్హోత్ర) కూడా అదృశ్యమవుతుంది. అప్పుడు విక్రమ్ ఈ రెండు కేసుల్ని ఎలా ఛేదించాడు?ఆయ‌న్ని వెంటాడుతున్న గ‌తం వెన‌క క‌థేమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.          


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని