ఇష్టమైన వారికి దగ్గరగా ఉండండి: సన్నీ లియోనీ

సన్నీ లియోనీ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆమె నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘జిస్మ్ 2’. ఈ సినిమాతో ఆమె కుర్రకారుకి గిలిగింతలు పెట్టింది. సన్నీ దక్షిణాది సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు మే 13న తన పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంది.

Published : 14 May 2021 21:46 IST

ఇంటర్నెట్ డెస్క్: సన్నీలియోని పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆమె నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘జిస్మ్ 2’. ఈ సినిమాతో ఆమె కుర్రకారుకి గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత దక్షిణాది సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు మే 13న తన పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకొంది. ఈ సందర్భంగా సన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ‘‘నా పుట్టినరోజు సందర్భంగా పిల్లలు నిషా, ఆషర్, నోహ్, నా భర్త డేనియల్ వెబెర్ ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వడంలో తమని తాము మించిపోయారు. నాకెంతో ఆనందంగా ఉంది. మన చుట్టూ ఉన్న అన్నింటిని సంపాదించుకుంటాం. కానీ కుటుంబం లేకుంటే మనం లేము. అదృష్టం ఏమిటంటే నాకు అందమైన కుటుంబం ఉంది. నేను మీ అందరిని ప్రేమిస్తున్నాను. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశ్వీర్వదిస్తాడు. ప్రస్తుతం మనం సురక్షితంగా ఉండాలి. ప్రియమైన వారిని దగ్గరుండి చూసుకోండి. వారిని కాపాడుకోండి. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, కుటుంబాన్ని పోషించడం తల్లిదండ్రులుగా అది మన పని, బాధ్యత. మాస్క్ ధరించండి.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి’’ అంటూ పేర్కొంది. ప్రస్తుతం సన్నీ హిందీ - తెలుగులో తెరకెక్కుతున్న ‘హెలెన్‌’, ‘కోకాకోల’లో నటిస్తోంది. విక్రమ్ భట్‌ దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ వెబ్‌ సిరీస్‌ చిత్రం ‘అనామిక’లో కీలకపాత్ర పోషిస్తోంది. రమేష్ తీటే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది బ్యాటిల్ ఆఫ్ భీమా కోరెగావ్’ చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని