Updated : 27 May 2022 11:04 IST

RRR: ‘రాజమౌళి.. మీరు సినిమాలు తీయకండి..’ : ఆర్‌ఆర్‌ఆర్‌పై హాలీవుడ్‌ నటుడు ఏమన్నారంటే..?

ఇంటర్నెట్‌డెస్క్‌: బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). ఇంతకాలం థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ హాలీవుడ్‌ నటుడు చిత్రబృందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘నెట్‌ఫిక్స్‌’ వేదికగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని వీక్షించిన పాటన్ ఓస్వాల్ట్ ట్విటర్‌ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని కోరారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓ అద్భుతమైన చిత్రం. ఈ సినిమా మీ దగ్గర్లోని థియేటర్లలో ఆడకపోతే ఇప్పుడు ఓటీటీల్లోనూ అందుబాటులో ఉంది.. తప్పక చూడండి. రాజమౌళి.. మీ ఆలోచన, సినిమా తెరకెక్కించిన విధానం, కథ చెప్పిన తీరు అత్యద్భుతం. మిమ్మల్ని సినిమాలు చేయడానికి అనుమతించకూడదు(మీరు ఇలాంటి సినిమాలు చేస్తే మిగిలిన వాళ్లు ఏమైపోతారనే ఉద్దేశంలో). మీ తదుపరి సినిమాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అని పాటన్‌ పేర్కొన్నారు. మన చిత్రానికి హాలీవుడ్‌ నటుల నుంచి ప్రశంసలు దక్కడంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌చరణ్‌-తారక్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని