RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)పై హాలీవుడ్ స్టార్ హీరో క్రిస్ హెమ్స్‌వర్త్ (Chris Hemsworth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో కలిసి నటించాలని ఉందని తెలిపాడు.
హైదరాబాద్: రాజమౌళి సృష్టించిన అద్భుతం ఆర్‌ఆర్‌ఆర్ (RRR).. ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాపై ఎందరో సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇందులో నటించిన రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్‌లకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వీళ్లిద్దరితో కలిసి నటించాలని హాలీవుడ్ హీరోలు కూడా కోరుకుంటున్నారు. తాజాగా ఓ హాలీవుడ్ హీరో తన మనసులో కోరికను బయటపెట్టాడు.
హాలీవుడ్ స్టార్ హీరో క్రిస్ హెమ్స్‌వర్త్ (Chris Hemsworth) సినీ ప్రియులందరికీ సుపరిచితమే. మార్వెల్ సినిమాల్లో ‘థోర్’ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడీ హీరో. తాజాగా తన సినిమా ‘ఎక్స్‌ట్రాక్షన్’ ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి మాట్లాడాడు. ‘ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చూశాను. ఎంతో అద్భుతంగా ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల (NTR) నటన నాకెంతో నచ్చింది. వారితో కలిసి పనిచేయాలనుంది. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే అది కచ్చితంగా నా అదృష్టంగా భావిస్తాను’’ అని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రబృందం షేర్ చేసింది. ఇక క్రిస్ హెమ్స్‌వర్త్‌కు ఇండియా అంటే ప్రత్యేకమైన గౌరవం ఉన్న విషయం తెలిసిందే. ఆ గౌరవంతోనే తన కుమార్తెకు కూడా ఇండియా అని పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించాడు. భారత్‌లోనూ తనకు అభిమానులున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా రామ్ చరణ్ తన హాలీవుడ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయని తెలిపాడు. రెండు నెలల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: క్వాష్ పిటిషన్‌ను సుప్రీంలో మెన్షన్ చేసిన సిద్ధార్థ లూథ్రా
-
Ram: అట్లీ దంపతులకు థ్యాంక్స్ చెప్పిన రామ్ పోతినేని.. ఎందుకంటే?
-
Vote: తొలిసారి ఓటు వేయనున్న 93 ఏళ్ల వృద్ధుడు..
-
Hyderabad: గణపయ్య బంగారు లడ్డూ వేలం.. ఎంత ధర పలికిందంటే?
-
IPOs: జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా, అప్డేటర్ సర్వీసెస్ ఐపీఓలు ప్రారంభం.. పూర్తి వివరాలివే!
-
India-Canada: ‘ఆరోపణలు నిజమని తేలితే..’: భారత్‌తో ఉద్రిక్తతల వేళ కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు