RRR: ఆస్కార్‌లోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హవా కొనసాగుతుంది..

మోస్ట్‌ ఏవైటెడ్‌ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). ఇప్పటివరకూ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపించిన ఈ సినిమా త్వరలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించ...

Updated : 14 Aug 2022 10:25 IST

హాలీవుడ్‌ మ్యాగజైన్‌ ఏం చెప్పిందంటే..

హైదరాబాద్‌: మోస్ట్‌ ఎవైటెడ్‌ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). ఇప్పటివరకూ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపించిన ఈ సినిమా త్వరలోనే ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్‌’ అవార్డుల్లోనూ హవా కొనసాగించనుందని ఓ ప్రముఖ హాలీవుడ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు విభాగాల్లో ఈ సినిమా పోటీ పడే అవకాశం ఉందంటూ కథనాలు ప్రచురించింది. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మ్యాగజైన్‌లో వచ్చిన కథనాల ప్రకారం ఏయే విభాగాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ముంగిట పోటీ ఇవ్వనుందంటే..

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ కల్పిత కథతో రూపుదిద్దుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్‌చరణ్ (Ram Charan)‌, తారక్‌ (Tarak) ప్రధాన పాత్రలు పోషించారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ నటించి మెప్పించారు. ఈ సినిమా చూసిన తర్వాత హాలీవుడ్‌ సైతం సలాం అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. నటీనటుల నటన, కథ, డైరెక్షన్‌, విజువలైజేషన్‌.. ఇలా ప్రతి అంశమూ అద్భుతమంటూ మెచ్చుకుంటోంది. కాగా, ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హవా కొనసాగనుందంటూ హాలీవుడ్‌ మ్యాగజైన్‌ ‘వెరైటీ’ కొనియాడింది. ఈ సంవత్సరం అకాడమీ అవార్డుల నామినేషన్‌లో ఎవరెవరు స్థానం దక్కించుకుంటారో ఊహించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గానూ ఎన్టీఆర్‌ ఉత్తమ నటుడిగా నామినేట్‌ కానున్నారని చెప్పుకొచ్చింది. అలాగే, ఉత్తమ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే విభాగాల్లో ఈ సినిమా నామినేట్‌ అయ్యే అవకాశం ఉందంటూ జోస్యం చెప్పింది. దీనికి సంబంధించిన పలు కథనాలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు, ముఖ్యంగా తారక్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్‌ మ్యాగజైన్‌ చెప్పింది నిజమైతే బాగుంటుందని పోస్టులు పెడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని