Hombale Films: కేజీయఫ్‌ నిర్మాణసంస్థతో సుధా కొంగరా చిత్రం..

హోంబాలే ఫిల్మ్స్‌ ప్రస్తుతం పరిచయం అవసరం లేని నిర్మాణ సంస్థ.  కేజీయఫ్‌తో భారీ విజయాన్ని అందుకున్న ఈ నిర్మాణ సంస్థ ప్రభాస్‌ సలార్‌ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Published : 21 Apr 2022 12:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హోంబాలే ఫిల్మ్స్‌ ప్రస్తుతం పరిచయం అవసరం లేని నిర్మాణ సంస్థ.  కేజీయఫ్‌తో భారీ విజయాన్ని అందుకొన్న ఈ నిర్మాణ సంస్థ ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ తదుపరి చిత్రంపై ఒక ఆసక్తికరమైన ట్విట్‌ చేసింది. తెలుగులో ‘గురు’ సినిమా చేసిన ప్రముఖ తమిళ దర్శకురాలు సుధా కొంగరతో నిర్మించబోతున్నట్లు అందులో పేర్కొంది. ‘కొన్ని కథలు ప్రజలకు చెప్పడానికి అర్హమైనవి, వాటిని సరైన పద్ధతిలో ఆవిష్కరించాలి. మా తదుపరి చిత్రాన్ని దర్శకురాలు సుధా కొంగరతో నిర్మిస్తున్నట్లు ప్రకటించడానికి గర్వపడుతున్నాము. మా అన్ని సినిమాల వలే ఇది కూడా విభిన్నమైనది’ అంటూ ఓ ఫొటోని షేర్‌ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని