Hombale Films: ‘కేజీయఫ్‌’ నిర్మాణ సంస్థ కొత్త చిత్రాలు.. ఆసక్తిగా టీజర్లు

‘కేజీయఫ్‌’ సిరీస్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న కన్నడ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌. యశ్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ‘కేజీయఫ్‌ 1’, ‘కేజీయఫ్‌ 2’ చిత్రాలు భారతీయ అభిమానులందరినీ కన్నడ చిత్ర పరిశ్రమ వైపు దృష్టి పెట్టేలా చేశాయి.

Published : 14 Apr 2022 15:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కేజీయఫ్‌’ సిరీస్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న కన్నడ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌. ఈ పతాకంపై యశ్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ‘కేజీయఫ్‌ 1’, ‘కేజీయఫ్‌ 2’ చిత్రాలు భారతీయ అభిమానులందరినీ కన్నడ చిత్ర పరిశ్రమ వైపు దృష్టి పెట్టేలా చేశాయి. దాంతో అక్కడ రూపొందుతున్న కొత్త చిత్రాలపై అంతటా ఆసక్తి నెలకొంది. గురువారం.. ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ విడుదల సందర్భంగా హోంబలే సంస్థ ప్రస్తుతం నిర్మిస్తున్న ‘రాఘవేంద్ర స్టోరీస్‌’, ‘కాంతార’ సినిమాల టీజర్లను పంచుకుంది. రెండు టీజర్లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ప్రముఖ నటుడు జగ్గేష్‌ ప్రధాన పాత్రలో హోటల్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘రాఘవేంద్ర స్టోరీస్‌’లో పూర్తిస్థాయి కామెడీ ఉండబోతుందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రానికి సంతోష్‌ దర్శకుడు. కర్ణాటక సంప్రదాయాలను ‘కాంతార’లో చూపించబోతున్నట్టు అర్థమవుతోంది. ఈ సినిమాలో రిషబ్‌శెట్టి, కిశోర్‌, అచ్యుత్‌ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కేజీయఫ్‌’ క్రేజ్‌ దృష్ట్యా ఈ సినిమాలు తెలుగులో విడుదలవుతాయా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని