Prabhas: ప్రభాస్‌ ఖాతాలో మరో మూడు.. మొత్తం8 ప్రాజెక్టుల్లో పాన్‌ ఇండియా స్టార్‌!

పాన్‌ఇండియా హీరో ప్రభాస్‌ వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకుల్ని ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘సలార్‌’....

Published : 22 Jan 2022 12:06 IST

హైదరాబాద్‌: పాన్‌ఇండియా హీరో ప్రభాస్‌ వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకుల్ని ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ‘సలార్‌’, ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’, ‘స్పిరిట్‌’ వంటి భారీ ప్రాజెక్ట్‌లతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించేందుకు ప్రభాస్‌ సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బ్రేక్‌ అనేది తీసుకోకుండా ఆయా సినిమా షూటింగ్స్‌లో ఆయన ఫుల్‌ బిజీగా పాల్గొంటున్నారు. ఓ వైపు ‘రాధేశ్యామ్‌’ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగానే.. మరోవైపు ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ షూటింగ్స్‌ ప్రారంభించేశారు.

దర్శకులు సైతం ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పాన్‌ ఇండియా కథలతో ఆయన కాంపౌండ్‌లోకి అడుగుపెడుతున్నారు. మరోవైపు నిర్మాతలు కూడా ప్రభాస్‌ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రభాస్‌ మరో మూడు సరికొత్త సినిమాలకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై బాలీవుడ్‌ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఫుల్‌ యాక్షన్‌ నేపథ్యంలో సాగే కథతో పాన్‌ ఇండియా మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రెండో ప్రాజెక్ట్‌.. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్యతో సినిమా చేసేందుకు ప్రభాస్‌ ఓకే చెప్పారట. ఈ మేరకు మారుతి ఓ హార్రర్‌ కామెడీ కథను రాసి ప్రభాస్‌కు చెప్పగా ఆయన ఓకే అన్నారట. దానయ్య-ప్రభాస్‌-మారుతి కాంబోలో రానున్న చిత్రానికి ‘రాజా డీలక్స్‌’ పేరు ప్రచారంలో ఉంది. ఈ రెండు కాకుండా దిల్‌రాజుతో మరో కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించే ఆలోచనలో ప్రభాస్‌ ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో రిలీజ్‌కు సిద్ధమైన ‘రాధేశ్యామ్‌’తో కలుపుకుని ప్రభాస్‌ చేతిలో మొత్తం ఎనిమిది ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని