Rashmika: ‘ప్రతి సినిమా ప్రత్యేకమైనదే’ అంటున్న టాప్‌ హీరోయిన్‌..

పుష్ప సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఆ చిత్రం తర్వాత అభిమానులు నాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే నేను కష్టపడతాను అని రష్మిక చెప్పింది.

Updated : 07 Oct 2022 12:55 IST

హైదరాబాద్‌: దక్షిణాది ముద్దుగుమ్మ రష్మిక ‘పుష్ప’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లుఅర్జున్‌తో తొలిసారి జోడి కట్టిన ఈ భామ తన డాన్స్, లుక్స్‌తో కుర్రకారును మైమరపించింది. దీంతో ఈ టాప్‌ హీరోయిన్‌పై సినీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొన్నారు. రష్మిక ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై  స్పందించింది. తనకు అన్ని సినిమాలు ప్రత్యేకమైనవే అని పేర్కొంది. తాను నటించిన చిత్రం ఏదైనా ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటానని చెప్పింది.

ఈ అమ్మడు అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన ‘గుడ్‌బై’ సినిమా ఈరోజు (october7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రష్మిక ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..‘పుష్ప సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఆ చిత్రం తర్వాత అభిమానులు నాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే నేను కష్టపడతాను. నేను నటించే ప్రతి సినిమా నాకు ప్రత్యేకమైనదే. ‘పుష్ప’ సినిమా అప్పుడు ఎలా అయితే కోరుకున్నానో ‘గుడ్‌బై’ సినిమాకు అలానే భావిస్తాను. ప్రేక్షకులు థియేటర్‌లకు వచ్చి సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటాను’’ అని చెప్పింది ఈ నేషనల్‌ క్రష్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని