Bollywood: ఇటు ప్రియురాలి చెప్పులు మోసిన హృతిక్‌.. అటు మృణాల్‌ను తిడుతోన్న నెటిజన్లు

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ (Hrithik  Roshan), నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) తాజాగా వార్తల్లోకి ఎక్కారు. ఒకరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంటే.. మరొకరు విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Updated : 05 Apr 2023 16:37 IST

ముంబయి: బీటౌన్‌ (Bollywood) సెలబ్రిటీలు ఏం చేసినా వార్తల్లోకి ఎక్కుతుంటారు. కొంతమంది తమ నిరాడంబరతతో నెటిజన్ల మది గెలుచుకుంటారు. మరి కొంతమంది ఏదో ఒక కారణంగా విమర్శలు ఎదుర్కొంటారు. తాజాగా నటుడు హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) చేసిన ఓ పనికి నెటిజన్లు మెచ్చుకుంటుంటే.. మరోవైపు డ్రెస్సింగ్‌ స్టైల్‌తో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) తిట్లు కాస్తున్నారు.

గ్రాండ్‌ ఈవెంట్‌లో చెప్పులు పట్టుకుని..!

నీతా అంబానీ కలల ప్రాజెక్ట్‌ ఎన్‌ఎంఏసీసీ (నీతాముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌) (NMACC) ప్రారంభోత్సవం ఇటీవల ముంబయిలో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌, హాలీవుడ్‌, దక్షిణాది సెలబ్రిటీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నటుడు హృతిక్‌ (Hrithik Roshan) ఆయన ప్రియురాలు సబా ఆజాద్‌ (Saba Azad)తో కలిసి సందడి చేశారు. పార్టీలో భాగంగా సబా.. తన డ్రెస్‌ను డిజైన్‌ చేసిన అమిత్‌ అగర్వాల్‌తో ఫొటోలు దిగగా.. వాటిని ఆయన తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ఇందులో హృతిక్‌.. సబా చెప్పులను చేత్తో పట్టుకుని కనిపించారు. ఇది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆయన్ని మెచ్చుకుంటున్నారు. గర్ల్‌ఫ్రెండ్‌ కష్టాన్ని అర్థం చేసుకుని ఆయన చేసిన పనికి ఫిదా అయినట్లు చెబుతున్నారు.

‘మా సీత ఇలా ఉండదు’..!

‘సీతారామం’ (Sita Ramam)తో విపరీతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). ఫీల్‌గుడ్‌ ప్రేమకథాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె చీరకట్టులో యువరాణిగా మెరిసిపోయారు. దీని తర్వాత ఆమెను అందరూ సీతగానే గుర్తు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వెకేషన్‌కు వెళ్లిన మృణాల్‌.. బీచ్‌లో బికినీతో ఫొటోలు దిగారు. వాటిని ఇన్‌స్టాలో షేర్‌ చేయగా.. నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘మా సీత ఇలా ఉండదు’, ‘నువ్వు మా సీతవు కాదు’ అంటూ  కామెంట్స్‌ పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని