Hrithik Roshan: రూ.100 కోట్ల ఫ్లాట్‌లోకి మారడం లేదు

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు హృతిక్‌రోషన్‌ భార్య సుజానేతో విడాకులు తీసుకున్న తర్వాత ప్రేమికురాలు, నటి సబా ఆజాద్‌తో డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 21 Nov 2022 06:49 IST

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు హృతిక్‌రోషన్‌ (Hrithik Roshan) భార్య సుజానేతో విడాకులు తీసుకున్న తర్వాత ప్రేమికురాలు, నటి సబా ఆజాద్‌తో (Saba Azad) డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ త్వరలోనే ముంబయిలో 38వేల చదరపు అడుగుల విశాలమైన, రూ.100 కోట్ల ఖరీదైన ఫ్లాట్లలోకి మారుతున్నారని కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. హృతిక్‌ ఆదివారం దీనిపై స్పందించారు. ఈ వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని కొట్టిపారేశారు. ‘పబ్లిక్‌ ఫిగర్‌ కావడంతో నాకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అందరూ ఉత్సుకత చూపించడం మామూలే. కానీ అదేసమయంలో తప్పుడు వార్తలపై నోరు మెదపకుండా ఉండటం కూడా సమంజసం కాదు. మేం కొత్త బంగ్లాలోకి మారుతున్నాం అనేదాంట్లో ఏమాత్రం నిజం లేదు’ అంటూ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని