హృతిక్‌ డ్రోన్‌ సెల్ఫీ చూశారా?

యాక్షన్‌ కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌. అంతేకాదు, తన సినిమాల్లో

Updated : 04 Jan 2021 11:57 IST

ముంబయి: యాక్షన్‌ కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌. అంతేకాదు, తన సినిమాల్లో అదిరిపోయే స్టెప్‌లతోనూ అభిమానులను అలరిస్తుంటాడు. నూతన సంవత్సరంలో అందరూ ఏదో ఒకటి నేర్చుకోవాలని అనుకుంటారు. హృతిక్‌ కూడా తన నైపుణ్యాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా ఓ డ్రోన్‌ను ఆపరేట్‌ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. ‘రంగ్‌దే బసంతి’ నటుడు కునాల్‌ కపూర్‌, తన స్నేహితుడితో కలిసి పచ్చటి బయళ్లపై పడుకొని ఉండగా, హృతిక్‌ డ్రోన్‌ను ఆపరేట్‌ చేస్తూ కనిపించారు.

‘‘కొత్త ఏడాదిలో కొత్త నైపుణ్యాలతో 2021లో అడుగు పెడుతున్నా’’ -ట్విటర్‌లో హృతిక్‌

ఇటీవల హృతిక్‌ తన కుమారుడితో కలిసి హాలీవుడ్‌ చిత్రం ‘వండర్‌ ఉమెన్‌’ను థియేటర్‌లో చూశారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నారు. నిబంధనలను పాటిస్తూ థియేటర్‌లో సినిమా చూడటం నిజంగా అద్భుతమైన అనుభూతి అని పేర్కొన్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు