Vikram Veda: విక్రమ్‌ వేద.. హృతిక్‌ లుక్‌ వచ్చేసింది.!

మాధవన్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన కోలీవుడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘విక్రమ్‌ వేద’. పోలీస్‌కు గ్యాంగ్‌స్టర్‌కు మధ్య జరిగే ధర్మయుద్ధంలో ఎవరు విజయం సాధించారనే ఆసక్తికర అంశంతో తెరకెక్కి....

Published : 10 Jan 2022 14:47 IST

ముంబయి: మాధవన్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన కోలీవుడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘విక్రమ్‌ వేద’. పోలీస్‌కు గ్యాంగ్‌స్టర్‌కు మధ్య జరిగే ధర్మయుద్ధంలో ఎవరు విజయం సాధించారనే ఆసక్తికర అంశంతో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్‌హిట్‌ అందుకుంది. దీంతో ఈ సినిమాని హిందీ ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. సైఫ్‌ అలీఖాన్‌, హృతిక్‌ రోషన్‌ మల్టీస్టారర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పుష్కర్‌ అండ్‌ గాయత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. సోమవారం హృతిక్‌ పుట్టినరోజు సందర్భంగా ‘విక్రమ్‌ వేద’ నుంచి ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం నెట్టింట్లో షేర్‌ చేసింది. ఇందులో హృతిక్‌ ఓ ఫైటర్‌లా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఇందులో ఆయన ‘వేద’ అనే గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించనున్నారు. ఒరిజినల్‌లో విజయ్‌ సేతుపతి పోషించిన పాత్రలో ఇప్పుడు హృతిక్‌ నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని