గుండెలు తాకే.. రానా ‘అరణ్య’ రోదన

వినూత్నమైన సినిమాలతో అలరించే రానా.. మరోసారి భిన్నమైన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది.

Published : 16 Mar 2021 22:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన సినిమాలతో అలరించే రానా.. మరోసారి ఓ సరికొత్త పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది. ఏరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తోంది. విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రీయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతను సంగీతం అందించారు. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, పాటలు సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. ‘హృదయమే’ అంటూ.. మొదలయ్యే ఈ విషాదగీతంలో ఏనుగుల కోసం హీరో పడే తపన స్పష్టంగా కనిపిస్తుంది. పాట హృదయాన్ని తాకేలా ఉంది. మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని