Published : 26 Apr 2022 11:59 IST

Salaar: ‘సలార్‌’ ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ ఓ రేంజ్‌లో ఉండబోతోందా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కేజీయఫ్‌2’తో యశ్‌ను పూర్తి స్థాయి పాన్‌ ఇండియా హీరోగా చూపించారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఇప్పుడు తమ హీరోను ఎలా చూపిస్తారా? అని ఎదురు చూస్తున్నారు ప్రభాస్‌ అభిమానులు. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సలార్‌’. శ్రుతిహాసన్‌ కథానాయిక. బొగ్గు గనుల నేపథ్యంలో పూర్తి యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా సాగనుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ మొత్తం ఓ లోయలో జరుగుతుందట. అండర్‌ గ్రౌండ్‌లో తెరకెక్కే ఆ సన్నివేశాలు తెరపై చూస్తుంటే ఒళ్లు గగురుపొడిచేలా ఉంటాయని అంటున్నారు. అంతేకాదు, లోయలో ఛేజింగ్‌ సన్నివేశాలు కూడా అదరగొట్టేస్తాయని చెబుతున్నారు. మరోవైపు ప్రభాస్‌ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందం సైతం భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్‌ స్థాయిలో సన్నివేశాలు ఉంటాయని చెబుతున్నారు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి తదుపరి షెడ్యూల్‌కు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. మే మొదటి వారంలో చిత్రీకరణ చేయనున్నారట. సింహభాగం ఈ షెడ్యూల్‌లోనే పూర్తి చేయాలని ప్రశాంత్‌ నీల్‌ భావిస్తున్నారు. ముఖ్యంగా టాకీ పార్ట్ అంతా పూర్తి చేస్తే, వేసవి తగ్గాక.. యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్‌ చేయాలని భావిస్తున్నారట. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని