Saif Ali Khan: ‘ఓపని చేయండి.. మా బెడ్‌రూమ్‌లోకీ వచ్చేయండి’.. సైఫ్‌ అలీఖాన్‌ చురకలు

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali  Khan) విలేకర్లతో వ్యంగ్యంగా స్పందించారు. ఫొటోలకు పోజులివ్వమని కోరగా ఆయన కాస్త అసహనానికి గురయ్యారు.

Published : 03 Mar 2023 20:40 IST

ముంబయి: తనను, తన సతీమణి కరీనా కపూర్ ‌(Kareena kapoor)ను ఫొటోలు తీసేందుకు ఆసక్తి చూపించిన ఫొటోగ్రాఫర్లకు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Alikhan) చురకలు అంటించారు. పడక గదిలోకీ వచ్చేయండి.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విలేకర్లతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉంటారు సైఫ్‌ (Saif). తాజాగా ఆయన తన భార్య కరీనాతో కలిసి ఓ సెలబ్రిటీ బర్త్‌డే పార్టీలో సందడి చేశారు. పార్టీ నుంచి వస్తోన్న సమయంలో పలువురు విలేకర్లు బేబో జంటను క్లిక్‌మనిపించేందుకు ఆసక్తి కనబర్చారు. వారి ప్రవర్తనతో కాస్త అసహనానికి గురైన సైఫ్‌.. ‘‘ఒకపని చేయండి. మా బెడ్‌రూమ్‌లోకి కూడా రండి’’ అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ఇటీవల అలియాభట్‌ (Aliabhatt) వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ.. ఆమె ఇంట్లో ఉన్న సమయంలో దొంగతనంగా ఇద్దరు వ్యక్తులు వీడియోలు తీసిన విషయం తెలిసిందే. ప్రతిదానికీ ఒక హద్దు ఉంటుందని.. దాన్ని వాళ్లు మితిమీరి ప్రవర్తించారని అలియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్‌ పెట్టారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఆమెకు మద్దతు తెలిపారు. అలియాకు ఎదురైన చేదు ఘటనను ఉద్దేశించే సైఫ్‌ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు