Hungama 2: ఓటీటీలో మరో బాలీవుడ్‌ చిత్రం

తాజాగా ‘హంగామా 2’ కూడా ఓటీటీలో విడుదల కానుంది. త్వరలోనే డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 22 May 2021 16:08 IST

ముంబయి: కరోనా రెండో దశ ప్రభావంతో చిత్రసీమ నష్టాల్లో కూరుపోయింది. థియేటర్లు మూతపడటంతో సినిమాలు పూర్తయినా విడుదల చేసే అవకాశం లేదు. చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నా కొన్ని మాత్రం ఇప్పటివరకూ ఎదురుచూశాయి. కానీ పరిస్థితులు చక్కబడటానికి మరింత సమయం పట్టేలా ఉండటంతో ఆ చిత్రాలు కూడా ఓటీటీలో విడుదలకే మొగ్గు చూపుతున్నాయి. తాజాగా ‘హంగామా 2’ కూడా ఓటీటీలో విడుదల కానుంది. త్వరలోనే డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

విజయవంతమైన బాలీవుడ్‌ చిత్రం ‘హంగామా’కు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమిది. పరేశ్‌ రావల్, శిల్పాశెట్టి, మీజన్‌ జాఫ్రీ, ప్రణీత ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రియదర్శన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మకంగా సాగనుంది. చిత్ర నిర్మాతలు రతన్‌ జైన్, చేతన్‌ జైన్, గణేష్‌ జైన్‌ ప్రముఖ ఓటీటీతో సంప్రదింపులు పూర్తి చేసినట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని