Hyper Aadi: నేనిప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా.. నవ్వులు పూయించిన హైపర్‌ ఆది

ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని సినీనటుడు హైపర్‌ ఆది అన్నారు.

Updated : 24 Jun 2024 13:43 IST

హైదరాబాద్‌: ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని సినీనటుడు హైపర్‌ ఆది (Hyper aadi) అన్నారు. తాను ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా అని వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ నిర్వహించిన విజయోత్సవ వేడుకలో ఆయన మాట్లాడారు.

కూటమి అనే సినిమా 164 రోజులు ఆడిందని.. అందుకే ఈ సక్సెస్‌ మీట్‌ అని ఆది అన్నారు. కుమారుడు తన మొదటి సంపాదనతో తల్లికి చీర కొనిపెట్టినప్పుడు, బైక్‌పై తండ్రిని కూర్చోబెట్టి తీసుకెళ్లినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో.. పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) గెలిచినపుడు ప్రతి జనసైనికుడి కళ్లలో అది చూశానన్నారు. లంకా దహనం తర్వాత హనుమంతుడు వెళ్లి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్లు.. ఎన్నికల్లో విజయం తర్వాత చిరంజీవి దగ్గరకి పవన్‌ అలా వెళ్లారన్నారు. అంతకంటే ఎమోషనల్‌ మూమెంట్‌ మరొకటి ఉండదని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని