నేనూ ఎంతో మందికి సాయం చేస్తున్నా: కంగన
సాయం చేయడానికి సోషల్‌మీడియా ఒక్కటే వేదిక కాదని నటి కంగనా రనౌత్ అన్నారు. తరచూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే కంగనా తాజాగా ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.....
నెటిజన్‌పై నటి ఫైర్
ముంబయి: సాయం చేయడానికి సోషల్‌మీడియా ఒక్కటే వేదిక కాదని నటి కంగనా రనౌత్ అన్నారు. తరచూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే కంగనా తాజాగా ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా ఎంతోమందికి సాయం చేస్తున్నానని.. తాను చేస్తున్న సాయం గురించి సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టి పబ్లిసిటీ పొందాల్సిన అవసరం తనకి లేదని ఆమె అన్నారు.
‘ప్రియాంక చోప్‌ఢా, ఆలియాభట్, తాప్సీ, ఇతర నటీనటులు మాదిరిగా కొవిడ్ బాధితులకు సాయం చేయడం కోసం కాకుండా కంగన తన ట్విటర్ ఖాతాను భాజపా ప్రభుత్వాన్ని ప్రశంసించడం కోసమే ఉపయోగిస్తున్నారు’ అని ఇటీవల ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. కాగా, తాజాగా ఆ ట్వీట్ చూసిన కంగన.. ‘ప్రజలకు సాయం చేయాలంటే ట్విటర్ ఒక్కటే వేదిక కాదు. దానికి వేరే మార్గాలు ఎన్నో ఉన్నాయి. నేను కూడా ఎంతోమందికి ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, వ్యాక్సిన్లతోపాటు ఆస్పత్రుల్లో అవసరమైన పడకలను ఏర్పాటు చేయించాను. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో తెలిసిన ఎంతోమంది నన్ను సాయం కోరారు. వారందరికీ నావంతు సాయం అందించా. ఇదంతా నేను పబ్లిసిటీ కోసం చేయడం లేదు’’ అని కంగన ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆన్లైన్ వేదికగా సెలబ్రిటీలను సాయం కోరే వారిలో కొంతమంది ఆక్సిజన్ సిలిండర్లు, మందులను బ్లాక్ మార్కెట్లో వేరే వాళ్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Eknath Shinde: ‘2024లో ఎన్డీయేదే పవర్.. మోదీ అన్ని రికార్డులూ బ్రేక్ చేస్తారు’
-
General News
Taraka Ratna: తారకరత్న హెల్త్ అప్డేట్.. కుప్పం చేరుకున్న బెంగళూరు వైద్య బృందం
-
Movies News
Social Look: చంద్రికా రవి ‘వాహనంలో పోజులు’.. ఐశ్వర్య ‘స్పై’ లుక్!
-
Viral-videos News
Ranbir Kapoor: అభిమాని సెల్ఫీ కోరిక.. కోపంతో ఫోన్‌ను విసిరేసిన రణ్‌బీర్!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Telangana News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 2,391 పోస్టుల భర్తీకి అనుమతి