Adivi sesh: నేను సింగిల్‌ కాదు

‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన నటుడు అడివి శేష్‌. తాజాగా ఆయన తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి పెదవివిప్పారు. హైదరాబాద్‌కు.....

Published : 04 Jun 2021 16:16 IST

ప్రేమలోపడిన మరో టాలీవుడ్‌ నటుడు

హైదరాబాద్‌: ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన నటుడు అడివి శేష్‌. తాజాగా ఆయన తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి పెదవి విప్పారు. హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయితో తాను ప్రేమలో పడినట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రియురాలితో ఏడడుగులు వేసేందుకు చాలా సమయం పట్టేలా ఉందని తెలిపారు. ‘మేజర్‌’ చిత్రంలో నటిస్తున్న ఆయన తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా తన తదుపరి చిత్రాలు, వ్యక్తిగత జీవితం గురించి స్పందించారు.

‘‘నా రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి ఇప్పుడే పబ్లిక్‌గా చెప్పాలనుకోవడం లేదు. నేను సింగిల్‌ మాత్రం కాదు. హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాను. ఇంతకు మించి ఎలాంటి విషయాన్ని ఇప్పుడు బయటపెట్టలేను. ఎందుకంటే.. తన వ్యక్తిగత జీవితానికి సైతం నేను గౌరవమివ్వాలనుకుంటున్నాను. తన దగ్గర పర్మిషన్‌ తీసుకున్నాక మిగతా విషయాలు బయటకు చెబుతా. ఇక, పెళ్లి విషయానికి వస్తే.. ప్రస్తుతానికి వరుస ప్రాజెక్ట్‌లతో నేను ఫుల్‌ బిజీగా ఉన్నాను. ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా సరిగ్గా సమయం దొరకడం లేదు. పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ముందు ‘మేజర్’‌, ఆ తర్వాత ‘హిట్‌-2’ పూర్తి కావాలి. అలాగే మరో ప్రాజెక్ట్‌ సైతం చర్చల దశలో ఉంది’ అని అడివిశేష్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని