నాకేం కాలేదు.. బాగానే ఉన్నా: ముఖేష్ ఖన్నా

బుల్లితెరపై ’శక్తిమాన్‌’ సూపర్‌ మ్యాన్ షోతో పాటు ‘మహాభారతం’ వంటి ధారావాహికలో భీష్ముడిగా నటించి అలరించిన అలనాటి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ముఖేష్‌ ఖన్నా. ఆయన చనిపోయారనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా ఆయన వీటిపై మంగళవారం తన ఫేస్‌బుక్‌ ద్వారా స్పందిస్తూ..‘‘నేను క్షేమంగానే ఉన్నాను. నాకు కరోనా సోకలేదు.

Updated : 13 May 2021 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బుల్లితెరపై ‘శక్తిమాన్‌’గా, ‘మహాభారతం’ ధారావాహికలో భీష్ముడిగా నటించి అలరించిన అలనాటి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ముఖేష్‌ ఖన్నా. ఆయన చనిపోయారనే వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా ఆయన వీటిపై తన ఫేస్‌బుక్‌ ద్వారా స్పందించారు.

‘‘నేను క్షేమంగానే ఉన్నాను. నాకు కరోనా సోకలేదు. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. ఇలాంటి వందతులు నమ్మొద్దు. ఈ విధమైన వార్తలు వ్యాప్తి చేసే వారిని శిక్షించాలి. ఇలాంటి నకిలీ వార్తలను ఆపాలి. ఇలా చేసేవారి ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు. మీ ఆశీర్వాదంతో నేను క్షేమంగా ఉన్నాను. నాకు కరోనా సోకలేదు. ఎలాంటి ఆసుపత్రిలోనూ చేరులేదు. ఇలాంటి తప్పుడు వార్తలు రాసి ప్రజల భావోద్వాగాలతో ఆడుకుంటున్నారు’’ అని మండిపడ్డారు.

మార్చిలో కొవిడ్‌ మొదటి వ్యాక్సిన్‌ డోస్‌ టీకాను తీసుకున్న ప్రముఖుల్లో ముఖేష్‌ ఖన్నా కూడా ఉన్నారు. ఆయన తెలుగులో సుమంత్ హీరోగా సలోని నాయికగా నటించిన ‘ధన 51’ చిత్రంలో నటించారు. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ, ఇండియా ఛైర్మన్‌గా పనిచేసిన ముఖేష్‌ 2018 ఫిబ్రవరి లో ఆ పదవికి రాజీనామా చేశారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని