Tabu: నా తండ్రి ఇంటిపేరు నేను ఉపయోగించను

కథానాయికగా.. ప్రతినాయికగా.. సహాయ నటిగా తనదైన విలక్షణ నటనతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది టబు. ప్రస్తుతం ఇటు దక్షిణాదిలోనూ.. అటు ఉత్తరాదిలోనూ వరుస సినిమాలు చేస్తూ జోరు చూపిస్తోంది.

Updated : 05 Nov 2022 08:27 IST

కథానాయికగా.. ప్రతినాయికగా.. సహాయ నటిగా తనదైన విలక్షణ నటనతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది టబు (Tabu). ప్రస్తుతం ఇటు దక్షిణాదిలోనూ.. అటు ఉత్తరాదిలోనూ వరుస సినిమాలు చేస్తూ జోరు చూపిస్తోంది. వ్యక్తిగత జీవిత విషయంలో చాలా గోప్యత పాటించే ఆమె.. తన తండ్రి ఇంటి పేరును ఉపయోగించకపోవడానికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ‘‘నా తండ్రి ఇంటి పేరును ఉపయోగించడం ముఖ్యమని నేనెప్పుడూ అనుకోలేదు. నేనెప్పుడూ తబస్సుమ్‌ ఫాతిమానే. ఇది నా మధ్య పేరు. స్కూల్లో ఫాతిమా నా ఇంటిపేరు. నాకు నా తండ్రితో జ్ఞాపకాలు లేవు. నా సోదరి ఫరా నాజ్‌ మాత్రం సందర్భానుసారంగా కొన్నిసార్లు ఆయన్ని కలుసుకుంది. నేనైతే ఎప్పుడూ ఆయన్ని కలవాలని అనుకోలేదు. తన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తీ లేదు. నేను నా జీవితంలో మంచిగా స్థిరపడ్డాను. చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది టబు. ఆమె తండ్రి పేరు జమాల్‌ అలీ హష్మీ. తల్లి రిజ్వానా. టబు బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఆమె నటించిన హిందీ ‘దృశ్యం2’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని