samantha: జీవితంలో చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నా: సమంత

జీవితంలో తాను చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నానని కథానాయిక సమంత (Samantha) అన్నారు.

Published : 09 Jan 2022 02:03 IST

హైదరాబాద్‌: జీవితంలో తాను చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నానని కథానాయిక సమంత (Samantha) అన్నారు. రోష్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన సైకియాట్రి ఎట్  యువర్ డోర్ స్టెప్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘‘నేను జీవితంలో చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నా. అలాంటి సమయంలో నా స్నేహితులు, వైద్యుల సహాయం తీసుకున్నా. నేను ఈ రోజు ధైర్యంగా నిలబడటానికి, జీవితంలో ముందుకి సాగటానికి నా స్నేహితులు, కుటుంబం, కౌన్సిలర్ల సహయమే కారణం. శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను ఎలాగైతే కలుస్తామో అలాగే మనసుకి గాయం అయినప్పుడు కూడా వైద్యులను సంప్రదించాలి’ అని చెప్పుకొచ్చారు.

అగ్రకథానాయిక సమంత (Samantha) వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ‘పుష్ప’లో ఐటమ్‌ సాంగ్‌లో అదరగొట్టిన సమంత.. ‘శాకుంతలం’, ‘యశోద’ చిత్రాలతో పాటు, ‘ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే అంతర్జాతీయ చిత్రంలోనూ నటిస్తున్నారు. వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan)తో కలిసి అమెజాన్‌ ప్రైమ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’(Citadel)లోనూ నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని