నేను ప్రేమలో విఫలమయ్యా: అనుపమ
నటి అనుపమ పరమేశ్వరన్ ఎట్టకేలకు తన ప్రేమ గురించి బయటపెట్టారు. ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించానని ఆమె తెలిపారు. ‘అ ఆ’తో నాగవల్లిగా మెప్పించి మొదటిసినిమాతోనే తెలుగువారికి చేరువైన ఈ మలయాళీ....
రియల్ లైఫ్ బ్రేకప్‌ను బయటపెట్టిన నటి
హైదరాబాద్: నటి అనుపమ పరమేశ్వరన్ తన ప్రేమ గురించి బయటపెట్టారు. గతంలో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించానని తెలిపారు. ‘అ ఆ’తో నాగవల్లిగా మెప్పించి తెలుగువారికి చేరువైన ఈ మలయాళీ కుట్టి వరుస ప్రేమకథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. సోషల్‌మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.
‘‘ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నాను. ‘18 పేజీలు’, ‘కార్తికేయ -2’, ‘రౌడీ బాయ్స్’ చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘తల్లిపోగాదే’లో నటిస్తున్నాను. ఇక, కన్నడ చిత్రపరిశ్రమను మిస్ అవుతున్నాను. మంచి ప్రాజెక్ట్‌లో అవకాశం వస్తే అక్కడ కూడా సినిమాలు చేస్తాను’’ అని తెలిపారు.
అనంతరం తన ప్రేమ గురించి స్పందిస్తూ.. ‘గతంలో నేను ప్రేమలో పడ్డాను. ఓ వ్యక్తిని ఎంతో ఇష్టపడ్డాను. కాకపోతే అది బ్రేకప్ అయిపోయింది’ అని అన్నారు. ఇక హీరో రామ్ పోతినేని తనకి మంచి స్నేహితుడని తెలిపారు. అలాగే తన ఇష్టాయిష్టాల గురించి చెబుతూ.. ‘అమ్మ చేతి వంట అంటే నాకెంతో ఇష్టం. పాటలు పాడటం కూడా ఇష్టమే. ఈ మధ్యకాలంలో పెయింటింగ్ నేర్చుకున్నాను. ఎప్పుడైనా ప్రశాంతత కావాలని భావించినప్పుడు వెంటనే పెయింటింగ్స్ వేస్తాను. దాంతో నా మనసు, హృదయం రెండూ సంతోషంగా మారుతాయి’ అని ఆమె వివరించారు.
అనుపమ ప్రేమలో ఉందంటూ ఎన్నో సందర్భాల్లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఆమె ఓ హీరోతో రిలేషన్‌లో ఉందంటూ అప్పట్లో అందరూ చెప్పుకున్నారు. అలాంటిదేమీ లేదని ఆమె ఎన్నో సందర్భాల్లో సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jaishankar-Blinken: బ్లింకెన్-జైశంకర్ భేటీకి ముందు.. అమెరికా మళ్లీ అదే స్వరం..!
-
Laddu Auction: బండ్లగూడ జాగీర్ లడ్డూ @ రూ.1.26 కోట్లు
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు