Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్‌

గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ఖాన్‌(Aamir Khan) తన కొత్త సినిమా ‘లాల్‌ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) ప్రచార నిమిత్తం దేశవ్యాప్తంగా తిరుగుతూనే ఉన్నారు. ఆగష్టు11న దేశవ్యాప్తంగా విడుదల కానున్న ‘లాల్‌ సింగ్ చడ్డా’ పై తాజాగా ఈయన హిందీ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో...

Published : 11 Aug 2022 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) తన కొత్త సినిమా ‘లాల్‌ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) ప్రచార నిమిత్తం దేశవ్యాప్తంగా తిరుగుతూనే ఉన్నారు. ఆగస్టు 11న దేశవ్యాప్తంగా విడుదల కానున్న ‘లాల్‌ సింగ్ చడ్డా’ పై తాజాగా ఆయన హిందీ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. ఈ సినిమా విడుదల కారణంగా గత 48 గంటల నుంచి తాను నిద్రపోలేదన్నారు. ‘లాల్‌సింగ్‌ చడ్డా విడుదలకు ముందు రెండు రోజుల నుంచి నేను నిద్రపోలేదు. నా దృష్టంతా ఈ సినిమాపైనే ఉంది. రాత్రుళ్లు ఆన్‌లైన్‌ చెస్‌ ఆడుతున్నా. పుస్తకాలు చదువుతున్నా. బ్రెయిన్‌పై ఒత్తిడి ఎక్కువవుతోంది. అసలు నిద్ర పట్టడంలేదు. సినిమా విడుదలయ్యాకే ప్రశాంతంగా నిద్రపోతానేమో!’ అంటూ తన ప్రస్తుత పరిస్థితి గురించి పంచుకున్నారు. ఈ చిత్రంలో ఆమిర్‌ఖాన్‌ సరసన కరీనాకపూర్‌ నటించింది. తెలుగు నటుడు నాగచైతన్య కీలక పాత్ర పోషించారు. 1994లో టామ్‌ హాంక్స్‌ కథానాయకుడిగా నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ చిత్రానికిది రీమేక్‌ కాగా, ఇందులో బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ ‘షారుఖ్‌’ అతిథి పాత్రలో మెరవనున్నారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్‌ సంస్థ విడుదల చేస్తోంది. ‘థగ్స్‌ ఆఫ్ హిందూస్థాన్‌‌’ తరువాత ఆమిర్‌ఖాన్‌ చిత్రమేది గత నాలుగేళ్లలో విడుదలవ్వలేదు. గతేడాది విడుదలైన హిందీ చిత్రం ‘కోయి జానే నా’లోని ఒక పాటలో అతిథిగా ఆమిర్‌ఖాన్‌ తెరపై కనిపించారు.

వారి అభిప్రాయన్ని గౌరవిస్తా

‘బాయ్‌ కాట్‌ లాల్‌సింగ్‌ చడ్డా’ (Boycott Lal Singh Chaddha) అంటూ కొందరు నెట్టింట ఆమిర్‌పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సినిమాని విడుదల చేయకూడదంటూ పోస్ట్‌ పెట్టారు. ఇదే విషయమై ప్రశ్న ఎదురవగా ఆమిర్‌ ఇలా స్పందించారు. ‘‘ఎవరినీ నొప్పించే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. ఒకవేళ నా వల్ల ఎవరైనా బాధపడితే అందుకు చింతిస్తున్నా. నా సినిమాని చూడకూడదన్న కొందరి అభిప్రాయాన్ని గౌరవిస్తా. ఇది నా ఒక్కడి సినిమా కాదు. ఎందరో నటులు, సాంకేతిక నిపుణుల సమష్టి కృషితో రూపొందింది. అందుకే ఈ సినిమా ఎక్కువ మందికి చేరాలని ఆశిస్తున్నా’’ అని ఆమిర్‌ పేర్కొన్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని