Balakrishna: వాళ్లు నన్ను ‘బాలా’ అని మాత్రమే పిలవాలి.. దానికి నేను ఒప్పుకోను: బాలకృష్ణ

‘అన్‌స్టాపబుల్’తో వ్యాఖ్యాతగా ఓ సరికొత్త రికార్డు క్రియేట్‌ చేశారు నటుడు బాలకృష్ణ. ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ షో 40 కోట్ల స్ట్రీమింగ్‌ నిమిషాలతో మోస్ట్‌ వాచ్డ్‌ షోగా రికార్డ్‌ బ్రేక్‌ చేసింది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు....

Published : 12 Feb 2022 12:53 IST

హైదరాబాద్‌: ‘అన్‌స్టాపబుల్’తో వ్యాఖ్యాతగా ఓ సరికొత్త రికార్డు క్రియేట్‌ చేశారు నటుడు బాలకృష్ణ. ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ షో 40 కోట్ల స్ట్రీమింగ్‌ నిమిషాలతో మోస్ట్‌ వాచ్డ్‌ షోగా రికార్డ్‌ బ్రేక్‌ చేసింది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అతిథిగా విచ్చేసిన ఎపిసోడ్‌తో ఈ షో ఫస్ట్‌ సీజన్‌కు శుభం కార్డు పడింది. ప్రస్తుతం ‘అన్‌స్టాపబుల్‌’కు సంబంధించిన అన్ని ఎపిసోడ్స్‌ ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఆహా’ టీమ్‌ బాలయ్యతో ‘నెవర్‌ హావ్‌ ఐ ఎవర్‌’ అనే గేమ్‌ ఆడించింది. నెటిజన్లు తెలుసుకోవాలనుకుంటున్న పలు ప్రశ్నలకు బాలయ్య ఈ గేమ్‌ ద్వారా సమాధానాలు ఇచ్చారు. ఇంతకీ బాలయ్యని అడిగిన ప్రశ్నలు ఆయన చెప్పిన సమాధానాలేమిటంటే..?

మీరు ఎప్పుడైనా కాలేజ్‌ మానేశారా?

బాలయ్య: నెవర్‌ అని బోర్డు చూపిస్తూ.. అయినా అన్నీ చెబుతామా? మనం ఎదుటివారిలో స్ఫూర్తి నింపాలి. అందుకే అలా చెబుతున్నా. కాలేజీ ఎప్పుడూ మానకండి.

మీరు ఎప్పుడైనా కాలేజ్‌ మానేస్తే మీ తండ్రికి తెలిసిందా?

బాలయ్య: నెవర్‌..

సోషల్‌మీడియాలో మీపై వస్తున్న మీమ్స్‌ చూసి ఎప్పుడైనా నవ్వుకున్నారా?

బాలయ్య: నవ్వుకున్నాను. కరోనా వచ్చిన సమయంలో ‘లెజెండ్‌’లో స్త్రీ గురించి నేను చెప్పిన డైలాగ్‌ని పలువురు నెటిజన్లు మీమ్స్‌ చేశారు. ఇటీవల నేను చేసిన ‘జై బాలయ్య’ పాటకు వచ్చిన ఫన్నీ వీడియోలు చూసి నవ్వుకున్నా.

ఎప్పుడైనా మీ కోస్టార్‌కి డ్యాన్స్‌ మూమెంట్స్‌లో టిప్స్‌ ఇచ్చారా?

బాలయ్య: టిప్స్‌ అని కాదు గానీ.. టెన్షన్‌ పడొద్దని చెబుతా.

మీ మనవళ్లు, మనవరాళ్లు తాతయ్య అని పిలిస్తే ఓకే అంటారా?

బాలయ్య: నో. వాళ్లు నన్ను బాలా అనే పిలవాలి. తాతయ్య, గ్రాండ్‌ పా అంటే నేను ఒప్పుకోను.

సెట్‌కి ఎప్పుడైనా లేట్‌గా వెళ్లారా?

బాలయ్య: నో

పబ్లిక్‌లోకి వెళ్లాలంటే ఎప్పుడైనా ఇబ్బందిపడ్డారా?

బాలయ్య: లేదు. పబ్లిక్‌తో నాలాగా కలిసే ఆర్టిస్ట్‌ ఎవరూ లేరు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని