రణ్‌వీర్‌ను పెళ్లి చేసుకోడానికి కారణమదే: దీపిక

రణ్‌వీర్‌-దీపిక.. బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ జంట. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్‌లీలా’ చిత్రీకరణలో మొదటిసారి పరిచయమైన వీరిద్దరూ అదే సమయంలో ప్రేమలో...

Published : 01 Feb 2021 01:21 IST

ఏడేళ్ల క్రితం పరిస్థితులు వేరు

ముంబయి: రణ్‌వీర్‌-దీపిక.. బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ జంట. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్‌లీలా’ చిత్రీకరణలో మొదటిసారి పరిచయమైన వీరిద్దరూ అదే సమయంలో ప్రేమలో పడ్డారు. ఏడేళ్ల డేటింగ్‌ తర్వాత ఈ జంట 2018లో నవంబర్‌ 14న వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కాగా, రణ్‌వీర్‌ కపూర్‌ను వివాహం చేసుకోడానికి గల కారణం గురించి ఇటీవల దీపికాపదుకొణె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఫేమ్‌, సంపాదనపరంగా రణ్‌వీర్‌ కంటే తాను ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ అతను మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండేవాడని.. ఒకేవిధంగా గౌరవించేవాడని.. అదే ఏడడుగుల బంధంలోకి వెళ్లేలా చేసిందని.. ఆమె తెలిపింది.

‘మొదటి నుంచి నా విజయాన్ని, సంపాదనను రణ్‌వీర్‌ ఎంతో గౌరవించాడు. ఇప్పుడు తాను కూడా స్టార్‌డమ్‌, ఫేమ్‌ పొందుతున్నాడు. కానీ ఏడేళ్ల క్రితం ఇవేమీ లేవు. అతను పరిచయమయ్యే సమయానికి నేను సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా ఉన్నాను. వరుస సినిమా షూట్స్‌తో చాలా బిజీగా గడిపేదాన్ని. కొన్నిసార్లు ఇంటికి కూడా వచ్చేదాన్ని కాదు. వరుస సినిమాల వల్ల నా సంపాదన కూడా ఎక్కువగానే ఉండేది. కానీ, మా ఇద్దరి మధ్య ఈ విషయాలేవీ వచ్చేవి కాదు. తను నన్ను అంతలా గౌరవించాడు. అలా మా బంధం మరింత బలపడింది. మేము ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టగలిగాం.’ అని దీపిక వివరించారు.

ఇదీ చదవండి

సెట్‌లో సేఫ్‌గా అనిపించలేదు: ప్రియాంక చోప్రా

పుష్ప షూట్‌.. బన్నీ ఎమోషనల్‌

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని