Nikhil: మెడికల్‌ ఎమర్జెన్సీ అన్నా వదల్లేదు

నానాటికి పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. దీంతో లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులు ఎక్కడికక్కడా...

Updated : 23 May 2021 16:30 IST

హైదరాబాద్‌: కరోనా ఉద్ధృతి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినతరం చేసిన విషయం తెలిసిందే.  కాగా, తాజాగా సినీ నటుడు నిఖిల్‌.. కొవిడ్‌ బాధితుడికి మందులు అందించేందుకు ఆసుపత్రికి వెళ్తుండగా పోలీసులు ఆయన్ని నిలిపివేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిఖిల్‌ ఓ ట్వీట్‌ పెట్టారు.

‘కొవిడ్‌ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తికి మందులు అందించేందుకు ఉప్పల్‌ నుంచి కిమ్స్‌ మినిస్టర్స్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నా కారుని ఆపేశారు. బాధితుడి వివరాలు, వైద్యుడి రాసిన మందుల చీటి చూపించినప్పటికీ పోలీసులు నన్ను అనుమతించలేదు. ఈ-పాస్‌ ఉండాల్సిందే అని చెప్పేశారు. అప్పటికీ నేను తొమ్మిదిసార్లు ప్రయత్నించినప్పటికీ సర్వర్లు డౌన్‌ కావడం వల్ల నాకు ఈ పాస్ దొరకలేదు. దాంతో మెడికల్‌ ఎమర్జెన్సీ అని చెబితే అనుమతి ఇస్తారని భావించి.. వచ్చాను’ అని నిఖిల్‌ ట్వీట్‌ పెట్టారు. నిఖిల్‌ ట్వీట్‌పై స్పందించిన హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ విభాగం.. ‘డియర్‌ సర్‌, మీ లొకేషన్‌ ఒక్కసారి మాకు పంపించండి. స్థానిక అధికారులతో మాట్లాడి మీ సమస్యను తీరుస్తాం’ అని రిప్లై ఇచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు