Published : 27 Apr 2022 10:30 IST

Chiranjeevi: దక్షిణాదిలో మాది కపూర్‌ ఫ్యామిలీ కావాలనుకున్నా: చిరంజీవి

హైదరాబాద్‌: దక్షిణాదిలో తన కుటుంబాన్ని కపూర్‌ ఫ్యామిలీగా తీర్చిదిద్దాలనుకున్నానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం ‘ఆచార్య’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిరు అటు ఆంగ్ల పత్రికలకు, ఇటు తెలుగు మీడియాకి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన ఓ ఆంగ్ల న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆచార్య’ తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని తెలిపారు. తన తనయుడు చరణ్‌తో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ‘ఆచార్య’ షూటింగ్‌ని ఎంతగానో ఎంజాయ్‌ చేశానని తెలిపారు.

బాలీవుడ్‌ చిత్రపరిశ్రమ గురించి స్పందిస్తూ.. ‘‘హిందీ చిత్రపరిశ్రమలో కపూర్‌ కుటుంబానికి ఓ ప్రాధాన్యత ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన తారలందరూ పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌లో కపూర్‌ ఫ్యామిలీకి ఉన్న ఫేమ్‌ చూసి నాకెంతో ముచ్చటేసింది. ఇదే విషయాన్ని ఓ సారి నా తమ్ముడు పవన్‌కల్యాణ్‌తో పంచుకున్నాను. మన కుటుంబం కూడా దక్షిణాది చిత్రపరిశ్రమలో కపూర్‌ కుటుంబంలా ఎదగాలని కోరుకుంటున్నానని పవన్‌తో చెప్పాను. ఈరోజు పవన్‌కల్యాణ్‌ నుంచి అల్లు అర్జున్‌ వరకూ నా కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసి తమకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్‌ స్టేటస్‌ సొంతం చేసుకున్నారు. అందుకు నేనెంతో ఆనందిస్తున్నా’’ అని చిరు వివరించారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని