యాక్షన్‌ సినిమా చేయాలి

ఇలియానా..   ఒకప్పుడు దక్షిణాదిని ఊపేసిన అందం. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కొన్ని సినిమాలు చేసింది. తర్వాత దక్షిణాదిలో రీ ఎంట్రీ ఇచ్చిన అంతగా కలిసి రాలేదు. ప్రస్తుతం...

Published : 23 Apr 2021 10:56 IST

ఇలియానా..   ఒకప్పుడు దక్షిణాదిని ఊపేసిన అందం. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కొన్ని సినిమాలు చేసింది. తర్వాత దక్షిణాదిలో రీ ఎంట్రీ ఇచ్చిన అంతగా కలిసి రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న చిత్రం ‘అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’. రణ్‌దీప్‌ హుడాతో కలిసి ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ మధ్య ఓ ఇంటర్య్వూలో ఇలియానా మాట్లాడుతూ ‘‘నా చేతిలో తక్కువ సినిమాలు ఉండటానికి కారణం నేను     తీసుకున్న నిర్ణయమే. నా   దగ్గరకు ఎన్ని కథలు వచ్చినా ఆచితూచి ఎంచుకుంటున్నాను. ఏదిపడితే అది చేయడం ఇష్టం లేదు. రొటిన్‌ పాత్రలు కాకుండా పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రంలో నటించాలనేది నా కోరిక’’అంటోంది ఇలియానా. ఈ మధ్య తన ట్విటర్‌ ఖాతాను హ్యాక్‌ చేశారంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా తెలియజేసింది. ‘‘నా ట్విటర్‌ ఖాతాను నేను ఓపెన్‌ చేయలేకపోతున్నా. హ్యాకింగ్‌కు గురైంది. నా ఖాతా నుంచి ఎలాంటి ట్వీట్లు వచ్చినా పట్టించుకోవద్దు’’అని రాసింది ఇలియానా.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు