RGV: ఎన్నికలకు ముందు కేసీఆర్‌ బయోపిక్‌: రాంగోపాల్‌ వర్మ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌ను ఎన్నికలకు ముందు తీస్తానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెలిపారు. నిజ జీవితం ఆధారంగా తీసే సినిమా కావడంతో స్క్రిప్ట్‌ పెద్ద కష్టమేం కాదని.. తన మెదడులోనే ఉంటుందన్నారు. ‘డేంజరస్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలను

Updated : 01 Apr 2022 07:17 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌ను ఎన్నికలకు ముందు తీస్తానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెలిపారు. నిజ జీవితం ఆధారంగా తీసే సినిమా కావడంతో స్క్రిప్ట్‌ పెద్ద కష్టమేం కాదని.. తన మెదడులోనే ఉంటుందన్నారు. ‘డేంజరస్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలను దిల్లీ ఆంధ్రా అసోసియేషన్‌ భవనంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ స్వలింగ సంపర్కం నేరం కాదని 2018లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన  నేపథ్యంలో డేంజరస్‌ సినిమా తీయాలనే ఆలోచన తనకు వచ్చిందన్నారు. ఇద్దరి మహిళల మధ్య ప్రేమను సమాజం ఇప్పుడిప్పుడే అంగీకరిస్తోందన్నారు. ఏప్రిల్‌ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఈ సినిమాను త్వరలో ఓటీటీలోనూ విడుదల చేస్తామని వెల్లడించారు. హీరోయిన్‌ అప్సర రాణి మాట్లాడుతూ ఎల్‌జీబీటీ ఉద్యమానికి తాను మద్దతు తెలిపానన్నారు. హీరోయిన్‌ నైనా గంగూలీ మాట్లాడుతూ అమ్మాయితో రొమాన్స్‌ నడిపే పాత్ర చేయడం చాలా కష్టమన్నారు.   

 - ఈనాడు, దిల్లీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని