Published : 21 May 2022 14:13 IST

Vijay Devarakonda: రౌడీ బాయ్‌తో రొమాంటిక్‌ సినిమా చేయాలని ఉంది: నటి

హైదరాబాద్‌: ‘అర్జున్‌రెడ్డి’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు విజయ్‌ దేవరకొండ. ఆ సినిమా విజయం తర్వాత మార్కెట్‌లో విజయ్‌ క్రేజ్‌ చూసి వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్‌ ఆయనతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలోనే మలయాళీ బ్యూటీ మాళవికా మోహన్‌ సైతం ఈ హీరోపై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టారు. తాజాగా ట్విటర్‌ చాట్‌లో పాల్గొన్న ఆమె నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రభాస్‌ అంటే తనకు ఇష్టమని. ఆయన నటించిన ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ చిత్రాలను దాదాపు 15 సార్లు చూశానని, అవకాశం వస్తే ఆయన సినిమాలో తప్పకుండా నటిస్తానని అన్నారు. మరో నెటిజన్‌.. ‘కన్నడ సినిమాల్లో నటిస్తారా?’ అని ప్రశ్నించగా.. ‘‘మంచి అవకాశం వస్తే ఓకే చేస్తా. కన్నడ నటుడు యశ్‌కు నేను వీరాభిమానిని. ‘కేజీయఫ్‌’ విడుదల కాకముందు నుంచే ఆయనంటే నాకెంతో ఇష్టం. ఏదో ఒకరోజు ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అప్పుడే అనుకున్నా. ఆయన లైఫ్‌స్టోరీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం’’ అని మాళవిక తెలిపారు. అనంతరం మరో నెటిజన్‌.. ‘‘రజనీకాంత్‌, ధనుష్‌, విజయ్‌ వంటి స్టార్‌ హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. మరి, ఇప్పుడు ఏ హీరోతో కలిసి సినిమా చేయాలని ఉంది?’’ అని ప్రశ్నించగా.. ‘‘విజయ్‌ దేవరకొండతో కలిసి రొమాంటిక్‌-కామెడీ చిత్రంలో నటించాలని ఉంది’’ అని ఆమె తెలిపారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన నటి..!

అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఎంతో సరదాగా సమాధానాలు చెప్పిన మాళవిక ఉన్నట్టుండి ఆగ్రహానికి లోనయ్యారు. ‘మీ బుర్ర పాడైపోయినట్లు ఉంది’ అని ఘాటుగా సమాధానమిచ్చారు. అసలేమైందంటే.. మాళవిక-ధనుష్‌ జంటగా నటించిన చిత్రం ‘మారన్‌’. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఈ చిత్రం డైరెక్ట్‌ ఓటీటీ వేదికగా విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్‌-మాళవిక సన్నిహితంగా ఉన్నట్లు చూపించారు. అయితే, ఇప్పుడు అదే సన్నివేశానికి సంబంధించిన ఓ పిక్‌ని షేర్‌ చేసిన నెటిజన్‌.. ‘‘ఈ సీన్‌ షూట్‌ చేయడానికి ఎన్ని టేక్స్‌ తీసుకున్నారు?’’ అని ప్రశ్నించాడు. దానికి కాస్త ఆగ్రహానికి లోనైన ఆమె ‘‘పాపం.. ఇలాంటి అనవసరమైన విషయాలు గురించి ఆలోచించి మీ బుర్ర మొత్తం పాడైపోయినట్లు ఉంది’’ అని కామెంట్స్‌ చేశారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని