Kangana Ranaut: కంగనతో నా కుమారుడి ప్రేమను వ్యతిరేకించలేదు: హీరో తండ్రి
బాలీవుడ్ ప్రేమ జంటగా ఒకప్పుడు వార్తల్లో నిలిచారు కంగనా రనౌత్ (Kangana Ranaut), అధ్యాయన్. అనుకోని కారణాల వల్ల వీరి మధ్య బ్రేకప్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వీరి బ్రేకప్ గురించి అధ్యాయన్ తండ్రి స్పందించారు.
ముంబయి: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut), నటుడు అధ్యాయన్ సుమన్ (Adhyayan Suman) ఎన్నో ఏళ్ల క్రితం రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. 2008లో తెరకెక్కిన ‘రాజ్’ సినిమాతో మొదలైన వీరి ప్రేమకథ అనుకోని కారణాలతో కొన్నినెలల్లోనే ముగింపు కార్డు పడింది. ఈ క్రమంలోనే వీరి బ్రేకప్ గురించి తాజాగా అధ్యాయన్ తండ్రి శేఖర్ స్పందించారు. తన కుమారుడి ప్రేమకు తాను వ్యతిరేకిని కాదని చెప్పారు.
‘‘కంగన - అధ్యాయన్ ప్రేమకథ గురించి నాకు పూర్తిగా తెలుసు. వాళ్ల మధ్య ఏం జరిగిందో కూడా తెలుసు. కానీ, నేను కంగనతో ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే, ఇది అధ్యాయన్ సమస్య. అతడే ఫైట్ చేయాలి. నేను కేవలం అతడికి ధైర్యం మాత్రమే ఇవ్వగలను. వాళ్ల ప్రేమకు నేను వ్యతిరేకిని కాదు. కంగన - అధ్యాయన్ విడిపోతే చూడాలని ఎంతో మంది అనుకున్నారు. రిలేషన్‌షిప్ సక్సెస్ కాకపోవడానికి వాళ్లిద్దరి తప్పు లేదు కానీ పరిస్థితుల ప్రభావంతోనే వాళ్లు విడిపోయారు’’ అని శేఖర్ వివరించారు.
ఇక, కంగన - అధ్యాయన్ రిలేషన్ గురించి అప్పట్లో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే శేఖర్ సైతం కంగనను తిడుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టాడు. అలాగే పలు ఇంటర్వ్యూల్లోనూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వీరి ప్రేమాయణం అప్పట్లో బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime news: కోర్కె తీర్చమంటే నో చెప్పిందని.. గర్ల్‌ఫ్రెండ్‌పై దారుణం
-
Politics News
Sattenapalli: కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు: నక్కా ఆనందబాబు
-
Sports News
WTC Final: ఆ సిరీస్ కంటే.. మాకిదే గ్రాండ్ ఫైనల్: ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్
-
India News
Karnataka CM: ‘ఐదు గ్యారంటీల’కు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.. ఈ ఏడాదే అమలు!