The Family Man 2: ఈ సారి ఏం చేశారో?
సుమారు మూడు నెలల ఎదురుచూపుల తర్వాత ‘ది ఫ్యామిలీ మేన్-2’ ట్రైలర్ విడుదలయ్యింది. విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘ది ఫ్యామిలీ మేన్’కి ఇది స్వీకెల్‌గా రానుంది....
హైదరాబాద్: సుమారు మూడు నెలల ఎదురుచూపుల తర్వాత ‘ది ఫ్యామిలీ మేన్-2’ ట్రైలర్ విడుదలయ్యింది. విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘ది ఫ్యామిలీ మేన్’కి ఇది స్వీకెల్. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, సమంత అక్కినేని ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. బుధవారం ఉదయం ఈ సిరీస్ ట్రైలర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. గత సీజన్ మాదిరిగానే శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ ఆకట్టుకున్నారు.
ఇక, సమంత విషయానికి వస్తే.. ఆమెకు ఇదే మొదటి వెబ్ సిరీస్. ఇందులో ఆమె రాజీ అనే ఉగ్రవాది పాత్రలో కనిపించనున్నారు. ‘వాళ్లందర్నీ నేను చంపేస్తా’ అంటూ ఆమె చెప్పే డైలాగ్‌లు, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. రాజీ కుట్రలను భగ్నం చేసి, ఆమెను అరెస్ట్ చేయడానికి శ్రీకాంత్ ఏవిధమైన ప్రయత్నాలు చేశాడు అనేది తెలియాలంటే మరి కొన్నిరోజులు ఎదురు చూడాల్సిందే. అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 4న ఈ కొత్త సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Australia: కనిపించకుండాపోయిన ‘రేడియోధార్మిక’ క్యాప్సూల్.. 1400 కి.మీల మేర వెతుకులాట!
-
India News
PM Modi: అదే మా నినాదం.. అభివృద్ధి మంత్రం: మోదీ
-
General News
Viveka Murder case: మళ్లీ పిలుస్తామన్నారు.. సీబీఐ విచారణకు సహకరిస్తా: అవినాష్‌రెడ్డి
-
India News
Mughal Gardens: మొఘల్ గార్డెన్స్.. ఇక ‘అమృత్ ఉద్యాన్’