Charmme: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఛార్మి

తాను ప్రస్తుతం జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నానని.. ఏడడుగులు వేసే ఉద్దేశం తనకు లేదని ప్రముఖ నటి, నిర్మాత ఛార్మి తెలిపారు. ఛార్మి త్వరలో పెళ్లి పీటలెక్కనుందంటూ....

Updated : 09 May 2021 14:29 IST

హైదరాబాద్‌: తాను ప్రస్తుతం జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నానని.. ఏడడుగులు వేసే ఉద్దేశం తనకు లేదని ప్రముఖ నటి, నిర్మాత ఛార్మి స్పష్టం చేశారు. ఛార్మి త్వరలో పెళ్లి పీటలెక్కనుందంటూ కొన్నిరోజుల నుంచి వరుస కథనాలు దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై ఈ ముద్దుగుమ్మ స్పందించారు. ‘కెరీర్‌ పరంగా ప్రస్తుతం నేను ఉన్నతస్థాయిలో ఉన్నాను. అలాగే జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నాను. వివాహబంధంలోకి అడుగుపెట్టి ఈ జీవితంలో తప్పు చేయాలనుకోవడం లేదు!!’ అని ఛార్మి ట్వీట్‌ చేశారు.

‘నీ తోడు కావాలి’ అనే సినిమాతో 15 ఏళ్ల వయసులోనే ఛార్మి కథానాయికగా వెండితెరకు పరిచయమ్యారు. లవ్‌, ఫ్యామిలీ, సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌.. ఇలా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించారు. ‘జ్యోతిలక్ష్మి’ అనంతరం ఆమె పూరీ జగన్నాథ్‌తో కలిసి ‘పీసీ కనెక్ట్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఈక్రమంలోనే ఛార్మికి వెంటనే పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారని.. తన దూరబంధువుతో ఆమె వివాహం ఓకే అయ్యిందని ఇటీవల వరుస కథనాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. దీంతో తాజాగా సదరు వార్తలపై ఛార్మి స్పందించారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని