Priyanka Chopra: నా అభిప్రాయాలు రుద్దను

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు ఎదిగిన అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా తన కుమార్తె గురించి తొలి సారి మాట్లాడింది. నటుడు, గాయకుడు నిక్‌ జోనస్‌ను ప్రియాంక వివాహం చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో ప్రియాంక

Updated : 15 Apr 2022 11:22 IST

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు ఎదిగిన అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా తన కుమార్తె గురించి తొలి సారి మాట్లాడింది. నటుడు, గాయకుడు నిక్‌ జోనస్‌ను ప్రియాంక వివాహం చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో ప్రియాంక సరోగసీ విధానంలో బిడ్డను పొందారు. తన పాపను ఎలా పెంచుతుందో తాజాగా ప్రియాంక ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. ‘నా ఆలోచనలను, భయాలను, కోరికలను తన మీద రుద్దాలని అనుకోవట్లేదు. నాకు పుట్టింది కాబట్టి అంతా నేనే నిర్ణయించాలని అనుకోవట్లేదు’ అని తన పెంపకం ఎలా ఉండనుందో వివరించింది. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులనూ గుర్తు చేసుకుంది. వారు తనకు తగిన స్వేచ్ఛ ఇచ్చారని తెలిపింది. వరుస సిరీస్‌లు, సినిమాలతో ప్రియాంక ప్రస్తుతం బిజీగా ఉంది. ‘టెక్స్ట్‌ ఫర్‌ యు’, ‘సీటాడెల్‌’, ‘ఎండింగ్‌ థింగ్స్‌’ తో పాటు ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో రానున్న ‘జీ లే జరా’ సినిమాలోనూ నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని