
RGV: రాజకీయాల్లోకి నో ఎంట్రీ
సేవ చేసే ఉద్దేశం అస్సలు లేదు
హైదరాబాద్: ప్రజలకు సేవ చేసే ఉద్దేశమే తనకు లేదన్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. కాబట్టి తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకోవడం లేదని తెలిపారు. సోషల్‌మీడియా వేదికగా ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆయన గతకొన్నిరోజుల నుంచి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విమర్శలు సంధిస్తూ వరుస పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్వరలో ప్రారంభం కానున్న స్పార్క్ ఓటీటీ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాజకీయాలపై స్పందించారు.
రాజకీయ నాయకులపై ఎప్పటికప్పుడు పవర్‌ఫుల్ సెటైర్లు వేస్తున్న మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని విలేకరి ప్రశ్నించగా.. ‘‘నో. నేను రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు. ఎందుకంటే జనాలకు సేవ చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నాకు నేను సేవ చేసుకోవడానికే టైమ్ సరిపోవడం లేదు. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్నవాళ్లే పొలిటిక్స్‌లోకి వస్తారు. అది నేను కాదు. సహజంగా ఏ నేత అయినా ఫేమ్, పవర్ కోసమే పొలిటిక్స్‌లోకి అడుగుపెడతాడు. కానీ, ఆ విషయాన్ని బయటకు చెప్పలేక ప్రజాసేవ అని పైకి చెబుతుంటాడు’’ అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు.
అనంతరం స్పార్క్ ఓటీటీ వేదికగా విడుదల కానున్న సినిమాల గురించి స్పందిస్తూ.. ‘‘ఓటీటీ అనేది రానున్న రోజుల్లో ప్రజలకు ఎంతగానో చేరువకానుంది. నాకు తెలిసిన ఓ వ్యక్తితో కలిసిన ఓటీటీని ప్రారంభిస్తున్నాం. మే 15న అది ప్రారంభం కానుంది. ఇందులో అన్నిరకాల కథాచిత్రాలు అందుబాటులో ఉంటాయి. దావూద్ ఇబ్రహీం జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ‘డీ కంపెనీ’ని సైతం దీనిలోనే విడుదల చేయనున్నాం. అతని జీవితాన్ని కొన్ని గంటల్లో సినిమాగా చూపించడం కొంతమేర కష్టమే అందుకే వెబ్‌సిరీస్‌గా తీసుకురానున్నాం. ఇప్పుడు విడుదల కానున్న ‘డీ కంపెనీ’ వెబ్‌సిరీస్ మొదటి పార్ట్‌గా భావించవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
-
Technology News
Gmail: ఇకపై ఆఫ్‌లైన్‌లో జీమెయిల్ సేవలు.. ఎలా పొందాలంటే?
-
World News
Nasa: తొలిసారి ఆస్ట్రేలియా వాణిజ్య స్పేస్ పోర్టును వాడిన నాసా
-
Viral-videos News
Deepest Shipwreck: ప్రపంచంలోనే అత్యంత లోతులో లభ్యమైన శిథిల నౌక ఇదే!
-
World News
Ukraine Crisis: ఈ ఏడాదిలోపు యుద్ధం ముగిసేలా చూడండి.. జీ-7 నేతలకు జెలెన్స్కీ అభ్యర్థన!
-
India News
Rahul Gandhi: యువతనేమో అగ్నివీరులుగా.. మీ స్నేహితులనేమో దౌలత్వీరులుగానా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Modi-Biden: హలో మోదీ జీ.. దగ్గరకు వచ్చి మరీ పలకరించిన జో బైడెన్
- Loan apps: వద్దన్నా లోన్లు.. ‘నగ్న ఫొటో’లతో వేధింపులు!
- Anand Mahindra: క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా సమాధానం!
- Vikram: కమల్‌హాసన్ ‘విక్రమ్’ 25 రోజుల్లో మరో రికార్డు!
- Rocketry: మాధవన్ ‘రాకెట్రీ’ని మెచ్చిన సీబీఐ అధికారులు
- Sonia Gandhi: సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచారం కేసు!
- Putin: ఆ సమయంలో.. పుతిన్ కాన్వాయ్ ఎందుకు వెళ్లింది..?
- Social Look: ప్రియాంక చోప్రా ముద్దూ ముచ్చట్లు.. చీరలో మెరిసిన ముద్దుగుమ్మలు!
- Viral Video: బోరిస్ జాన్సన్‌ను వెంబడించిన పోలీసులు.. అసలేమయ్యింది..?
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)